కొత్తూరు(మహబూబ్‌నగర్): విద్యార్థినుల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామ గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన లారీ డ్రైవర్లు రాము(24), చెన్నయ్య(22), బీటెక్ విద్యార్థులు మహేష్(22), రాకేష్(21) ఉదయం గ్రామంలోని బస్టాప్ వద్ద నిలబడి... విద్యార్థినులు, యువతులను చూసుకుంటూ తమ సెల్‌ఫోన్లలో అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.
ఈ విషయాన్ని అక్కడే ఉన్న షీ టీం సభ్యులు సుమారు అర్థగంట పాటు గమనించారు. మాటలతో ఆగకుండా వారి అగడాలు మితిమీరడంతో నలుగురినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారిని షాద్‌నగర్ కోర్టులో హాజరుపరుచనున్నట్లు సీఐ గంగాధర్ వెల్లడించారు.
నలుగురు ఈవ్ టీజర్లకు రిమాండ్
Published Wed, Aug 19 2015 4:37 PM | Last Updated on Thu, Jul 11 2019 8:06 PM
Advertisement
Advertisement