'మోదీ ఇంటర్వ్యూ మేం ప్రచురించం' | french leading news paper denies to publish narendra modi interview | Sakshi
Sakshi News home page

'మోదీ ఇంటర్వ్యూ మేం ప్రచురించం'

Published Fri, Apr 10 2015 6:38 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

'మోదీ ఇంటర్వ్యూ మేం ప్రచురించం' - Sakshi

'మోదీ ఇంటర్వ్యూ మేం ప్రచురించం'

ప్రధాని నరేంద్రమోదీ ఇంటర్వ్యూ ప్రచురించేందుకు ప్రముఖ ఫ్రెంచి పత్రిక లీ మాండె తిరస్కరించింది. ప్రశ్నలకు సమాధానాలు రాసి పంపుతారు తప్ప.. నేరుగా సమాధానాలు ఇవ్వబోరని మోదీ ప్రతినిధి చెప్పడంతో ఆ పత్రిక ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని లీ మాండె దక్షణాసియా కరస్పాండెంట్ జూలియన్ బోయిసూ ట్వీట్ చేశారు. దానికి బదులు లీ ఫిగారోతో ఈ మెయిల్ ఇంటర్వ్యూ కోసం ప్రధానమంత్రి కార్యాలయం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం రాత్రి ఫ్రాన్సు వెళ్లారు. నాలుగు రోజుల ఈ పర్యటనలో ఆయన అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్తో సమావేశమవుతారు, వ్యాపారవేత్తలతోనూ భేటీ అవుతారు. ఈ పర్యటనలో ప్రధాని ఫ్రెంచి అధ్యక్షుడితో కలిసి సియెన్ నదిలో బోటులో షికారుచేస్తూ చర్చిస్తారు. దీన్ని 'నావ్ పే చర్చా' అని చెబుతున్నారు. ఫ్రాన్సు పర్యటన పూర్తయిన తర్వాత ఆయన జర్మనీ, కెనడా దేశాల్లో పర్యటిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement