నిజామాబాద్ జిల్లాలో గ్యాంగ్‌రేప్ | gang rape in nizambad district | Sakshi
Sakshi News home page

నిజామాబాద్ జిల్లాలో గ్యాంగ్‌రేప్

Published Wed, Jul 6 2016 9:37 PM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

నిజామాబాద్ జిల్లాలో గ్యాంగ్‌రేప్

నిజామాబాద్ జిల్లాలో గ్యాంగ్‌రేప్

ఎడపల్లి(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట శివారులో బుధవారం ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన 22 ఏళ్ల యువతి నిజామాబాద్‌లో నివసిస్తోంది. నిజామాబాద్‌కు చెందిన హుస్సేన్, రహీం, సల్మాన్ అనే ముగ్గురు కూలీలతో కలిసి కూలి పనులకు వెళ్లేది. బుధవారం వారితో కలిసి జాన్కంపేటకు వెళ్లింది. అక్కడ నలుగురూ కలిసి మద్యం తాగారు.

అనంతరం ముగ్గురు కలిసి ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అస్వస్థతకు గురైన యువతిని భుజంపైన తీసుకుని వెళ్తున్న హుస్సేన్‌ను స్థానికులు గమనించి నిలదీశారు. అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని ప్రశ్నించగా.. మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. బాధితురాలి చేయిపై బ్లేడ్‌తో చేసిన గాయాలున్నాయి. కేసు నమోదు చేసుకుని బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎడపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement