edapally
-
పాలు పోయించుకుని పొమ్మన్నారు: జీతం అడిగితే పోలీస్ కేసు!
ఎడపల్లి (బోధన్): నెలల తరబడి పని చేసినందుకు జీతం అడిగితే.. ఓ యువకుడిపై సంబంధిత అధికారులు పోలీసు కేసు నమోదు చేయించారు. వివరాలను బాధితుడు బోధన్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియాతో మాట్లాడాడు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామానికి చెందిన కె.శివకుమార్ అనే విద్యార్థి గ్రామంలో ఉన్న విజయ డెయిరీ పాల కేంద్రంలో గత 20 నెలలుగా పనిచేశాడు. కొన్ని నెలలు సక్రమంగా జీతం చెల్లించిన అధికారులు ఆ తర్వాత వేతనాలు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అంతేగాక తాను పనిచేసిన కాలంలో ప్రతి రోజు తాను డెయిరీకి పంపించిన పాలలో వెన్న శాతంలో కోత, పాల తూకంలో కోతలు విధిస్తూ ప్రతి నెల సుమారు రూ.ఐదువేల నష్టం చేకూర్చారని శివకుమార్ ఆరోపించారు. చదవండి: వాటికి వ్యతిరేకంగానే నా సినిమా: ఆర్.నారాయణమూర్తి డెయిరీ నుంచి వచ్చిన నష్టం నిజమేనని డెయిరీ సూపర్వైజర్లు కూడా ధృవీకరించారు. 11 నెలల కాలంలో వచ్చిన 55 వేల రూపాయలు నష్టం, 11 నెలల నెలసరి జీతం 55 వేల రూపాయలు తనకు డెయిరీ వారు చెల్లించాల్సి ఉందని శివకుమార్ తెలిపారు. దీంతో తాను రైతులకు రూ.37 వేలు బకాయి పడ్డానని ఆయన తెలిపారు. డెయిరీ అధికారులు తాను రైతులకు రూ.89 వేలు చెల్లించాల్సి ఉందని ఆరోపిస్తు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వాస్తవం లేదన్నారు. విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ నందకుమారి తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని శివకుమార్ ఆరోపించారు. ఈ విషయమై డీడీ నందకుమారి వైఖరిపై విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసినట్లు శివకుమార్ తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. చదవండి: ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం -
నిజామాబాద్ జిల్లాలో గ్యాంగ్‌రేప్
ఎడపల్లి(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట శివారులో బుధవారం ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన 22 ఏళ్ల యువతి నిజామాబాద్‌లో నివసిస్తోంది. నిజామాబాద్‌కు చెందిన హుస్సేన్, రహీం, సల్మాన్ అనే ముగ్గురు కూలీలతో కలిసి కూలి పనులకు వెళ్లేది. బుధవారం వారితో కలిసి జాన్కంపేటకు వెళ్లింది. అక్కడ నలుగురూ కలిసి మద్యం తాగారు. అనంతరం ముగ్గురు కలిసి ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అస్వస్థతకు గురైన యువతిని భుజంపైన తీసుకుని వెళ్తున్న హుస్సేన్‌ను స్థానికులు గమనించి నిలదీశారు. అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని ప్రశ్నించగా.. మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. బాధితురాలి చేయిపై బ్లేడ్‌తో చేసిన గాయాలున్నాయి. కేసు నమోదు చేసుకుని బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎడపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. -
దర్గాలో దంపతుల హత్య
నిజామాబాద్(ఎడవల్లి): నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. దర్గాలో నిద్రిస్తున్న దంపతుల్ని దుండగులు బండరాళ్లతో మోది హత్య చేశారు. వివరాలు... ఎడపల్లి మండలం జానకం పేట గ్రామానికి చెందిన సయ్యద్ దావూద్ అలీ(58), రహ్మానా బేగం(54)లు బుధవారం రాత్రి అశోక్ సాగర్ దర్గాలో కాపలాకు ఉన్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు వారిపై బండరాళ్లు వేసి చంపేశారు. గురువారం ఉదయం ఈ దారుణం వెలుగు చూసింది. దుండగుల్ని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు జానకంపేట రహదారిపై రాస్తారోకోకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు ప్రారంభించారు. కాగా మృతులు స్థానికంగా హోటల్ నడుపుతూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం.