
గోదారి గట్టున బాపు, రమణ
ప్రఖ్యాత సినీ దర్శకుడు, చిత్రకారుడు దివంగత బాపు(సత్తిరాజు లక్ష్మీనారాయణ), ఆయన మిత్రుడు, ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకటరమణ విగ్రహాలను మంగళవారం సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రాజమండ్రిలోని గోదావరి గట్టుపై శ్రీ ఉమా మార్కండేయేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు.
- రాజమండ్రి