ఇంటా, బయటా బంగారం ఢమాల్!
ఇంటా, బయటా బంగారం ఢమాల్!
Published Mon, Dec 5 2016 3:41 PM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
న్యూఢిల్లీ : ఇంటా, బయటా బంగారానికి బెంగ పట్టుకుంది. దీంతో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. అంతర్జాతీయంగా బలహీనమైన పరిస్థితులతోపాటు, దేశీయంగా పెద్ద నోట్ల రద్దు అనంతరం నెలకొన్న ప్రతికూల కారణాలతో బంగారం ధరలకు బెంగ పట్టుకుంది. సోమవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.200 పడిపోయి రూ.29,050గా నమోదైంది. ఇదేసమయంలో వెండికి డిమాండ్ ఎగిసింది. కేజీ వెండి ధర రూ.200 పెరిగి రూ.41,200గా రికార్డైంది. పరిశ్రమ యూనిట్లు, కాయిన్ మార్కెట్ల నుంచి వస్తున్న డిమాండ్తో వెండి ధరలు మార్కెట్లో బాగానే ఉన్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ను పక్కనపెడితే, దేశీయంగా జువెల్లర్స్ నుంచి డిమాండ్ తగ్గినట్టు ట్రేడర్లు పేర్కొన్నారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు నేపథ్యంలో బంగారం పడిపోతోంది. అదేవిధంగా బంగారానికి షాకిస్తూ ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రకటనలు కూడా గోల్డ్కు ప్రతికూలంగా మారుతున్నాయి. గ్లోబల్గా గోల్డ్ ధరలు ఔన్స్కు 0.64 శాతం పడిపోయి, 1,169.60 డాలర్లుగా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్ ధరలు చెరో రూ.200గా పడిపోయి రూ.29,050గా, రూ.28,900గా ఉన్నాయి. శనివారం ట్రేడింగ్లో ఈ ధరలు రూ.250 పెరిగిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement