రేపే జీశాట్-15 ప్రయోగం
సాక్షి, సూళ్లూరుపేట: జీశాట్-15 ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.04 గంటలకు జీశాట్-15ను ఇస్రో ప్రయోగించనుంది. అరైన్-5-వీఏ 227 అనే ఉపగ్రహ వాహకనౌక ద్వారా 3,164 కిలోలు బరువున్న జీశాట్-15తో పాటు అరబ్‌శాట్-6బీనూ రోదసిలోకి పంపనున్నారు. జీశాట్-15లో 24 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్స్ , రెండు గగన్ పేలోడ్స్ (జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్యుమెంట్ నావిగేషన్) అనే ఉపకరణాలను అమర్చి పంపుతున్నారు.