satellite experiment
-
5న కక్ష్యలోకి జీఐశాట్–1
సూళ్లూరుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్–10) ఉపగ్రహ వాహక నౌక ద్వారా జీఐశాట్–1 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సా.5.43 గంటలకు దీనిని రోదసిలోకి పంపుతారు. దేశరక్షణ వ్యవస్థకు, విపత్తుల సమాచారాన్ని ముందుగా తెలుసుకోవడమే జీశాట్–1 ముఖ్యోద్దేశం. ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్టమొదటి సారిగా భూస్థిర కక్ష్యలోకి పంపిస్తున్నారు. ప్రయోగమిలా... మంగళవారం : ఎంఆర్ఆర్ (మిషన్ రెడీనెస్ రివ్యూ) కమిటీ ఆధ్వర్యంలో లాంచ్ రిహార్సల్స్ బుధవారం : బ్రహ్మప్రకాష్ హాలులో ఎంఆర్ఆర్ చైర్మన్ బీఎన్ సురేష్, కాటూరి నారాయణ ఆధ్వర్యంలో మిషన్ సంసిద్ధత సమావేశం. అనంతరం మూడు దశల రాకెట్ అనుసంధానం. తర్వాత తుదివిడత పరీక్షలు. లాంచ్ ఆ«థరైజేషన్ బోర్డు (ల్యాబ్)కు అప్పగింత. బుధవారం సాయంత్రం : ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో రిహార్సల్స్. సా.3.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం. ఆ వెంటనే రెండో దశలో 42.21 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియ ప్రారంభం. గురువారం : సాయంత్రం 5.43 గంటలకు నింగిలోకి దూసుకుపోనున్న జీఎస్ఎల్వీ. భూస్థిర కక్ష్యలోకి జీఐశాట్ – 1. -
ఐఆర్ఎన్ఎస్ఎస్–1 హెచ్ ప్రయోగానికి రంగం సిద్ధం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 31న ప్రయోగించ తలపెట్టిన ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్–1 హెచ్) ఉపగ్రహాన్ని మంగళవారం పీఎస్ఎల్వీ సీ–39 రాకెట్‌కు అమర్చారు. 1,400 కిలోల బరువైన ఈ ఉపగ్రహాన్ని రాకెట్‌కు శిఖర భాగాన అనుసంధానించారు. అన్ని పరీక్షలు నిర్వహించి బుధవారం హీట్‌షీల్డ్ క్లోజ్ చేసే ప్రక్రియను పూర్తి చేయను న్నారు. 28న తుది విడత సంసిద్ధతా కార్యక్రమం నిర్వహి స్తారు. అనంతరం కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 31 సాయంత్రం 6.59కి ప్రయోగాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రయోగం తేదీని, సమయాన్ని తుదివిడత ఎంఆర్ఆర్ సమావేశంలో అధికారికంగా ప్రకటిస్తారు. -
పీఎస్ఎల్వీ-సీ33 కౌంట్‌డౌన్ షురూ
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్సెంటర్లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ -సీ33 రాకెట్ ప్రయోగానికి మంగళవారం ఉదయం 9.20 గంటలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్న రాకెట్‌ను గురువారం మధ్యాహ్నం 12.50గంటలకు ప్రయోగించనున్నారు. మొత్తం 51.30 గంటల కౌంట్‌డౌన్‌లో భాగంగా మంగళవారం రాకెట్‌కు నాలుగోదశలో ద్రవ ఇంధనం నింపారు. బుధవారం రెండోదశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాకెట్‌కు అవసరమైన అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేసి గురువారం మధ్యాహ్నం రాకెట్‌ను ప్రయోగిస్తారు. ఈ ప్రయోగంలో 1,425 కిలోల బరువైన ఉపగ్రహాన్ని రోదసీలోకి రాకెట్ మోసుకెళ్లనుంది. భారత క్షేత్రీయ దిక్సూచీ వ్యవస్థ(ఐఆర్ఎన్ఎస్ఎస్) ఏర్పాటుకు 2014జులై 1 నుంచి ఇప్పటివరకు ఇస్రో ఆరు ఉపగ్రహాలను ప్రయోగించింది. ఏడోది, చివరిది అయిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ప్రయోగం విజయవంతమయ్యాక ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ను అందుబాటులోకి తెస్తారు. భూ, జల, వాయుమార్గాల స్థితిగతులను తెలియజేయడం వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. -
వాయిదాపడిన ఇస్రో ఉపగ్రహ ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): నిర్దేశించిన సమయానికి ఉపగ్రహం తయారీ పూర్తికాకపోవడంతో మార్చి 31న జరగాల్సిన ఇస్రో... ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహ ప్రయోగం వాయిదాపడింది. ఏప్రిల్ మూడో వారానికి వాయిదాపడినట్లు తెలుస్తోంది. మార్చి 10న పీఎస్ఎల్వీ సీ32 ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్‌ను, మార్చి 31న ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీను ప్రయోగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మార్చి 10న ప్రయోగించబోయే ఉపగ్రహానికి షార్‌లోని క్లీన్‌రూంలో ఇంధనాన్ని నింపే ప్రక్రియ చేపడుతున్నారు. మరో రెండు మూడురోజుల్లోనే రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్‌కు శాటిలైట్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను చేపట్టనున్నారు. -
ఫ్రాన్స్‌తో కలసి అంగారకుడి పైకి..
న్యూఢిల్లీ: అతి తక్కువ వ్యయంతో అంగారకుడి వద్దకు ఉపగ్రహాన్ని పంపి రికార్డు సృష్టించిన ఇస్రో.. మరిన్ని అద్భుతమైన ప్రాజెక్టులకు రంగం సిద్ధం చేస్తోంది. ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థతో కలసి అంగారకుడితోపాటు శుక్రగ్రహంపైకి ల్యాండర్లను పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ (ఎఫ్ఎస్ఏ) చీఫ్ జీన్వైవ్స్ లేగాల్ ఆదివారం ఢిల్లీలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇస్రో చేసిన మంగళ్యాన్ ప్రయోగం ఎంతో అద్భుతమని, అతి తక్కువ వ్యయంతో దానిని విజయవంతం చేయడంలో ఇక్కడి శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయమని ఆయన చెప్పారు. తమ వద్ద అంగారకుడితోపాటు శుక్రగ్రహంపై విస్తృత పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఉన్నారని.. మరోవైపు ఇస్రో కూడా పరిశోధనలు ముమ్మరం చేసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంగారకుడిపై పరిశోధనలో ఇస్రోతో కలసి పనిచేయనున్నామని, ఈ మేరకు సహకార ఒప్పందంపై సంతకాలు కూడా చేశామని తెలిపారు. అరుణగ్రహంపైకి ఇస్రో పంపనున్న తర్వాతి ఉపగ్రహ ప్రయోగంలో తమ పాత్ర కూడా ఉంటుందన్నారు. అంగారకుడితోపాటు శుక్రుడిపైకి కూడా ల్యాండర్ల (రోవర్ల)ను పంపే దిశగా కూడా ఇస్రోతో కలసి పనిచేస్తామని లేగాల్ తెలిపారు. -
రేపే జీశాట్-15 ప్రయోగం
-
రేపే జీశాట్-15 ప్రయోగం
సాక్షి, సూళ్లూరుపేట: జీశాట్-15 ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.04 గంటలకు జీశాట్-15ను ఇస్రో ప్రయోగించనుంది. అరైన్-5-వీఏ 227 అనే ఉపగ్రహ వాహకనౌక ద్వారా 3,164 కిలోలు బరువున్న జీశాట్-15తో పాటు అరబ్‌శాట్-6బీనూ రోదసిలోకి పంపనున్నారు. జీశాట్-15లో 24 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్స్ , రెండు గగన్ పేలోడ్స్ (జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్యుమెంట్ నావిగేషన్) అనే ఉపకరణాలను అమర్చి పంపుతున్నారు. -
జూన్ 9న భూకంపాలను గుర్తించే ఉపగ్రహ ప్రయోగం
చెన్నై: సునామీ, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలను గుర్తించే ఉపగ్రహాన్ని జూన్ 9వ తేదీన ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ వెల్లడించారు. చెన్నై విమానాశ్రయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాల్లో భూకంపం, సునామీ తీవ్రమైనవని, వీటి రాకను ముందుగానే పసిగట్టినట్లయితే ముందస్తు చర్యలు తీసుకునేందుకు, ప్రజలను కాపాడేందుకు వీలవుతుందన్నారు. అదేవిధంగా భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ(ఐఆర్ఎన్ఎస్ఎస్) ఏర్పాటులో భాగంగా ఇటీవల అంతరిక్షానికి పంపిన నాలుగో ఉపగ్రహం బాగా పనిచేస్తోందని కిరణ్‌కుమార్ తెలిపారు. పూర్తిస్థాయి ఐఆర్ఎన్ఎస్ఎస్ సేవల కోసం ఏడు ఉపగ్రహాలు అవసరమని, ఇందుకుగాను 5వ ఉపగ్రహాన్ని డిసెంబర్లో, 6, 7వ ఉపగ్రహాలను వచ్చే ఏడాది మార్చిలో ప్రయోగిస్తామన్నారు. -
జీశాట్-16 ప్రయోగం వాయిదా
సూళ్లూరుపేట/బెంగళూరు: ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం తె ల్లవారుజామున చేపట్టాల్సిన జీశాట్-16 ఉపగ్ర హ ప్రయోగం ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా పడింది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్ రాకెట్ ద్వారా జీశాట్-16ను ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాట్లు పూర్తిచేసినా, వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఏరియన్ రాకెట్ ద్వారా భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్న ఈ ఉపగ్రహంలో సమాచార వ్యవస్థకు ఉపయోగించే 12 కేయూ బ్యాండ్, 24 సీబ్యాండ్, 12 ఎక్స్టెండెడ్ సీబ్యాండ్ ట్రాన్స్పాండర్ల(సిగ్నళ్లను స్వీకరించి, ప్రసారం చేసే పరికరాలు)ను అమర్చారు. జీశాట్-16 ఉపగ్రహం భారత్ ప్రయోగిస్తున్న 11వ సమాచార ఉపగ్రహం కాగా, పెద్దమొత్తంలో 48 ట్రాన్స్పాండర్లను ఒకేసారి పంపనుండటం ఇదే తొలిసారి.