ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1 హెచ్‌ ప్రయోగానికి రంగం సిద్ధం | The IRNSS-1H is ready for the experiment | Sakshi
Sakshi News home page

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1 హెచ్‌ ప్రయోగానికి రంగం సిద్ధం

Published Wed, Aug 23 2017 3:38 AM | Last Updated on Sun, Sep 17 2017 5:51 PM

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1 హెచ్‌  ప్రయోగానికి రంగం సిద్ధం

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1 హెచ్‌ ప్రయోగానికి రంగం సిద్ధం

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ నెల 31న ప్రయోగించ తలపెట్టిన ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1 హెచ్‌) ఉపగ్రహాన్ని మంగళవారం పీఎస్‌ఎల్‌వీ సీ–39 రాకెట్‌కు అమర్చారు. 1,400 కిలోల బరువైన ఈ ఉపగ్రహాన్ని రాకెట్‌కు శిఖర భాగాన అనుసంధానించారు.

అన్ని పరీక్షలు నిర్వహించి బుధవారం హీట్‌షీల్డ్‌ క్లోజ్‌ చేసే ప్రక్రియను పూర్తి చేయను న్నారు. 28న తుది విడత సంసిద్ధతా కార్యక్రమం నిర్వహి స్తారు. అనంతరం కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 31 సాయంత్రం 6.59కి ప్రయోగాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రయోగం తేదీని, సమయాన్ని తుదివిడత ఎంఆర్‌ఆర్‌ సమావేశంలో అధికారికంగా ప్రకటిస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement