
గ్రామీణ జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారులు @ 27.43 కోట్లు
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో జీఎస్‌ఎం మొబైల్ విని యోగదారులు పెరుగుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా 16.6 లక్షల మంది జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారులు జతయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) బుధవారం తెలిపింది. అంతకు ముందటి నెలతో పోల్చితే 0.61 శాతం వృద్ధి నమోదైందని వివరించింది. దీంతో గ్రామీణ ప్రాంత జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య 27.43 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
ట్యాబ్లెట్లకు పెద్ద స్క్రీన్ మొబైళ్ల గ్రహణం
పెద్ద సైజు స్క్రీన్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల వైపే వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ఇది ట్యాబ్లెట్ల విక్రయాలపై ప్రభావం చూపుతోంది. దీంతో ఈ ఏడాది విక్రయమయ్యే ట్యాబ్లెట్ల సంఖ్య అంచనాలను ఐడీసీ సవరించింది. గతంలో ప్రపంచవ్యాప్తంగా 22.74 కోట్ల ట్యాబ్లెట్‌లు అమ్ముడవుతాయని ఐడీసీ ంచనా వేసింది. ఈ అంచనాను ఇప్పుడు 60 లక్షలకు తగ్గించి 22.15 కోట్లకు తగ్గించింది.