హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టోల్-ఫ్రీ సేవలు | HDFC Bank launches toll-free banking service | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టోల్-ఫ్రీ సేవలు

Published Mon, Feb 17 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్  టోల్-ఫ్రీ సేవలు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టోల్-ఫ్రీ సేవలు

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టోల్-ఫ్రీ బ్యాంకింగ్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ టోల్-ఫ్రీ బ్యాంకింగ్ సర్వీసులో ఆరు ప్రాథమిక బ్యాంకింగ్ లావాదేవీలను ఖాతాదారులు నిర్వహించుకోవచ్చని బ్యాంక్ హెడ్(డిజిటల్ బ్యాంకింగ్) నితిన్ చుగ్ చెప్పారు. మినీ స్టేట్‌మెంట్, బ్యా లెన్స్ ఎంక్వైరీ సమాచారాన్ని ఎస్‌ఎం ఎస్‌ల ద్వారా ఖాతాదారులకు అందిస్తామని చెప్పారు.

మొబైల్ బ్యాంకింగ్ యాప్ డౌన్‌లోడ్, చెక్‌బుక్ రిక్వెస్ట్, అకౌంట్ స్టేట్‌మెంట్, ఈ మెయిల్ స్టేట్‌మెంట్ వంటి మరో 4 సర్వీసులను పొందవచ్చన్నారు. ఈ సర్వీస్ ఉచితమని, ఎలాంటి చార్జీలు లేవని చెప్పారు. బేసిక్ మొబైల్ హ్యాండ్‌సెట్ ద్వారానైనా ఈ సర్వీసును రాత్రీ, పగలు ఎప్పుడైనా పొందవచ్చని పేర్కొన్నారు. ఎస్‌ఎంఎస్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎంల ద్వారా లేదా సమీపంలోని బ్యాంక్ బ్రాం చీలో నమోదు చేసుకోవడం ద్వారా కానీ ఈ టోల్-ఫ్రీ బ్యాంకింగ్ సర్వీస్‌ను పొందవచ్చని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement