banking transactions
-
సీబీ సీఐడీకి జయలక్ష్మి సొసైటీ కేసు విచారణ
కాకినాడ రూరల్: కాకినాడ జిల్లాలో సుమారు రూ.520 కోట్ల వరకు డిపాజిటర్లకు కుచ్చుటోపీ పెట్టి బోర్డు తిప్పేసిన ది జయలక్ష్మి మ్యూచువల్లి ఎయిడెడ్ మల్టీ పర్పస్ (ఎంఏఎం) కో–ఆపరేటివ్ సొసైటీ కేసు విచారణ బాధ్యత సీబీ సీఐడీ చేపట్టనుంది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా సర్పవరం జంక్షన్లో ప్రధాన బ్రాంచ్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 29 బ్రాంచ్‌లు కలిగి బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్న ది జయలక్ష్మి ఎంఎఎం కో–ఆపరేటివ్ సొసైటీ ఆకర్షణీయమైన వడ్డీల పేరిట 19,971 మంది నుంచి డిపాజిట్లను సేకరించింది. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు సుమారు రూ.520 కోట్ల వరకు డిపాజిట్ చేసినట్లు తెలిసింది. కాగా, కాలవ్యవధి పూర్తిచేసుకున్న డిపాజిట్‌దారులకు ఆ మొత్తాన్ని చెల్లించకుండా తిప్పుకుంటుండడంతో.. వారు సంస్థ కార్యాలయం ముందు పలుమార్లు ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్ 6వ తేదీ రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి సంస్థ పాలకవర్గం అదృశ్యమయ్యింది. డిపాజిటర్ల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసు స్టేషన్‌తో పాటు ఆయా బ్రాంచ్‌ల పరిధిలోనూ పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో ఇప్పటి వరకు రూ.230 కోట్ల మేర అవకతవకలు జరిగాయని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు ‘సహకార’ ఉద్యోగులతో విచారణ కమిటీని నియమించింది. వారి విచారణ గడువు జూన్ 22వ తేదీ (60 రోజులు)తో ముగిసినా.. విచారణ ఇంకా పూర్తి కాలేదు. దీంతో మరో రెండు నెలలు గడువు పొడిగించాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే.. చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు పరారీలో ఉండడం, వారిని ఇంతవరకు పోలీసులు అరెస్టు చేయకపోవడంతో డిపాజిట్ దారులు ఆందోళనకు దిగారు. విచారణను సీబీ సిఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో డీజీపీ ఆదేశాల మేరకు ‘జయలక్ష్మి’ కేసును పోలీసులు సీబీ సీఐడీకి అప్పగించారు. సర్పవరం జంక్షన్ వద్దనున్న సంస్థ మెయిన్ బ్రాంచ్‌లో స్వాధీనం చేసుకున్న రికార్డులను పోలీసులు విశాఖలోని ఆర్ఐఓ కార్యాలయంలో సీబీ సీఐడీ అధికారులకు అప్పగించారు. -
ఇన్‌కంటాక్స్ స్థానంలో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ టాక్స్!
-
స్తంభించిన రూ.20వేల కోట్ల లావాదేవీలు
న్యూఢిల్లీ : స్వల్ప వేతనాల పెంపు ప్రతిపాదనను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మె నేడు రెండో రోజుకి చేరుకుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్వీసులు స్తంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, వివిధ ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది ఉద్యోగులు ఈ దీక్ష చేపడుతున్నారు. ఈ రెండు రోజుల బ్యాంకింగ్ సమ్మెతో రూ. 20వేల కోట్ల బ్యాంకింగ్ లావాదేవీలు స్తంభించినట్టు తెలిసింది. తొలి రోజు వంద శాతం సమ్మె విజయవంతమైందని బ్యాంకింగ్ ఉద్యోగులు పేర్కొన్నారు. రెండో రోజు కూడా బ్యాంకు శాఖల్లో అన్ని బ్యాంకింగ్ సర్వీసులను రద్దు చేశామని యూఎఫ్‌బీయూ కన్వీనర్(మహారాష్ట్ర) దేవిదాస్ తుల్జపుర్కర్ అన్నారు. తొలిరోజు ఏటీఎం సర్వీసులు కొన్ని గంటల పాటు మూత పడి, అనంతరం ప్రారంభమయ్యాయి. బ్యాంకు లాభాలు పడిపోవడానికి కారణం ఉద్యోగులు కాదని తుల్జపుర్కర్ అన్నారు. ప్రొవిజన్స్ ఎక్కువగా పెరగడంతో బ్యాంకులు ఎక్కువ నష్టాలు చవి చూస్తున్నాయన్నారు. 2012 నాటి వేతన సవరణలో 15% మేర పెంచి.. తాజాగా రెండు శాతమే ఇస్తామనడం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులను అవమానించడమేనని వారు అంటున్నారు. ఇటు నెలాఖరు, అటు వేతనాల సమయం కూడా కావడంతో ఈ సమ్మె విత్‌డ్రాయల్ లావాదేవీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. పలు చోట్ల ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. -
బ్యాంకింగ్ లావాదేవీలపై ఐటీ కన్ను
• ఏడాదిలో రూ.10 లక్షలపైన డిపాజిట్ వివరాలు • తెలపాలని బ్యాంకులకు సూచన న్యూఢిల్లీ: నల్లధనం నిరోధానికి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. వార్షికంగా రూ. 10 లక్షలపైన డిపాజిట్లపై వివరాలను తనకు తెలియజేయాలని బ్యాంకులకు సూచించింది. అలాగే క్రెడిట్ కార్డులపై వార్షికంగా రూ. లక్ష ఆపై బిల్లుల వివరాలనూ తెలపాలని కోరింది. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల (సీబీడీటీ) కేంద్ర బోర్డ్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. వివరాలను అందించడానికి ఒక ఈ–ప్లాట్‌ఫామ్‌ను ప్రతిపాదించింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 మధ్య ఒక వ్యక్తి ఒక అకౌంట్ లేదా అంతకుమించి అకౌంట్లలో రూ.2.5 లక్షలు లేదా ఆపైన డిపాజిట్ చేస్తే... ఆ వివరాలను తమకు అందించాలని నవంబర్‌లో తాను జారీ చేసిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని కూడా బ్యాంకింగ్‌కు తన తాజా నోటిఫికేషన్లో సూచించింది. కరెంట్ అకౌంట్ విషయంలో పరిమితి మొత్తం రూ.12.50 లక్షలు ఆపైన కావడం గమనార్హం. కార్పొరేట్ కంపెనీ, సహకార బ్యాంకులకూ తాజా నిబంధన వర్తిస్తుందని తెలిపింది. సహకార బ్యాంకులపై లేఖ ఇదిలావుండగా, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కొన్ని సహకార బ్యాంకుల అకౌంట్లలో తీవ్రమైన వైరుధ్యాలు, అవకతవకలు కనిపించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి ఆదాయపు పన్ను శాఖ ఒక లేఖ రాసింది. తమ విచారణలో ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు కనుగొన్నటువివరిం చింది. ముంబై. పూనేల్లో ఇం దుకు సంబంధించి రూ.113 కోట్ల అవకతవకలను గుర్తిం చినట్లు ఐటీ శాఖ తన విశ్లేషణా పత్రాల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ తరహా ఘటనలపై విశ్లేషణాత్మక నివేదికలను ఆర్థికశాఖ, ఆర్బీఐలకు ఐటీ శాఖ సమర్పించిందనీ, చర్యలకు విజ్ఞప్తి చేసిందనీ అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. -
ఎస్బీఐ ఖాతాదారులకు రివార్డు పాయింట్లు
ముంబై: వివిధ బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణ విషయంలో ఖాతాదారులకు ప్రోత్సాహక పాయింట్లు ఇవ్వనున్నట్లు ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. స్టేట్ బ్యాంక్ రివార్డ్జ్ ప్రోగ్రాం కింద ... డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి మాధ్యమాలతో లావాదేవీలు నిర్వహించే వారికి రివార్డ్ పాయింట్లు ఇవ్వనున్నట్లు వివరించారు. అలాగే రుణాల ఈఎంఐలు సకాలంలో చెల్లించేవారికి, డీమ్యాట్ పెయిడ్ అకౌంట్లు, ఆన్లైన్లో సేవింగ్స్ ఖాతాలు తెరిచే వారికి కూడా పాయింట్లు ఉంటాయని వివరించారు. 100 రివార్డు పాయింట్లు.. రూ. 25కి సమానమని ఆమె పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి స్టేట్ బ్యాంక్ రివార్డ్జ్ పేరిట మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ఆమె తెలిపారు. -
బ్యాంకులకు వరుస సెలవులు..
-
బ్యాంకులకు వరుస సెలవులు..
హైదరాబాద్ : బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు బ్యాంకులకు దీర్ఘ కాలిక సెలవులు రానున్నాయి. మార్చి 28న శ్రీరామ నవమి, మార్చి 29, ఏప్రిల్ ఒకటో తేదీల్లో అకౌంట్స్ క్లోజింగ్ సందర్భంగా బ్యాంకులు సెలవు పాటించనున్నాయి. అలాగే మార్చి 30, 31 తేదీల్లో కొన్ని బ్యాంకులు పని చేస్తాయి. ఇక ఏప్రిల్ 2న మహావీర్ జయంతి, ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే సందర్భంగా బ్యాంకులకు మళ్లీ సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 4న శనివారం బ్యాంకులు పని చేసినా ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 5న ఆదివారం మళ్లీ సెలవు రానుంది. వరుస సెలవుల నేపథ్యంలో కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు వర్గాలు సూచిస్తున్నాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టోల్-ఫ్రీ సేవలు
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టోల్-ఫ్రీ బ్యాంకింగ్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ టోల్-ఫ్రీ బ్యాంకింగ్ సర్వీసులో ఆరు ప్రాథమిక బ్యాంకింగ్ లావాదేవీలను ఖాతాదారులు నిర్వహించుకోవచ్చని బ్యాంక్ హెడ్(డిజిటల్ బ్యాంకింగ్) నితిన్ చుగ్ చెప్పారు. మినీ స్టేట్మెంట్, బ్యా లెన్స్ ఎంక్వైరీ సమాచారాన్ని ఎస్ఎం ఎస్‌ల ద్వారా ఖాతాదారులకు అందిస్తామని చెప్పారు. మొబైల్ బ్యాంకింగ్ యాప్ డౌన్లోడ్, చెక్‌బుక్ రిక్వెస్ట్, అకౌంట్ స్టేట్మెంట్, ఈ మెయిల్ స్టేట్మెంట్ వంటి మరో 4 సర్వీసులను పొందవచ్చన్నారు. ఈ సర్వీస్ ఉచితమని, ఎలాంటి చార్జీలు లేవని చెప్పారు. బేసిక్ మొబైల్ హ్యాండ్సెట్ ద్వారానైనా ఈ సర్వీసును రాత్రీ, పగలు ఎప్పుడైనా పొందవచ్చని పేర్కొన్నారు. ఎస్ఎంఎస్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎంల ద్వారా లేదా సమీపంలోని బ్యాంక్ బ్రాం చీలో నమోదు చేసుకోవడం ద్వారా కానీ ఈ టోల్-ఫ్రీ బ్యాంకింగ్ సర్వీస్‌ను పొందవచ్చని తెలిపారు.