ఎస్‌బీఐ ఖాతాదారులకు రివార్డు పాయింట్లు
ముంబై: వివిధ బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణ విషయంలో ఖాతాదారులకు ప్రోత్సాహక పాయింట్లు ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. స్టేట్ బ్యాంక్ రివార్డ్జ్ ప్రోగ్రాం కింద ... డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి మాధ్యమాలతో లావాదేవీలు నిర్వహించే వారికి రివార్డ్ పాయింట్లు ఇవ్వనున్నట్లు వివరించారు. అలాగే రుణాల ఈఎంఐలు సకాలంలో చెల్లించేవారికి, డీమ్యాట్ పెయిడ్ అకౌంట్లు, ఆన్‌లైన్లో సేవింగ్స్ ఖాతాలు తెరిచే వారికి కూడా పాయింట్లు ఉంటాయని వివరించారు. 100 రివార్డు పాయింట్లు.. రూ. 25కి సమానమని ఆమె పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి స్టేట్ బ్యాంక్ రివార్డ్జ్ పేరిట మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ఆమె తెలిపారు.