బ్యాంకింగ్‌ లావాదేవీలపై ఐటీ కన్ను | IT department special focus on banking transactions | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌ లావాదేవీలపై ఐటీ కన్ను

Published Fri, Jan 20 2017 12:58 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

బ్యాంకింగ్‌ లావాదేవీలపై ఐటీ కన్ను - Sakshi

బ్యాంకింగ్‌ లావాదేవీలపై ఐటీ కన్ను

ఏడాదిలో రూ.10 లక్షలపైన డిపాజిట్‌ వివరాలు
తెలపాలని బ్యాంకులకు సూచన


న్యూఢిల్లీ: నల్లధనం నిరోధానికి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. వార్షికంగా రూ. 10 లక్షలపైన డిపాజిట్లపై వివరాలను తనకు తెలియజేయాలని బ్యాంకులకు సూచించింది. అలాగే క్రెడిట్‌ కార్డులపై వార్షికంగా రూ. లక్ష ఆపై బిల్లుల వివరాలనూ తెలపాలని కోరింది. ఈ మేరకు  ప్రత్యక్ష పన్నుల (సీబీడీటీ) కేంద్ర బోర్డ్‌ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. వివరాలను అందించడానికి ఒక ఈ–ప్లాట్‌ఫామ్‌ను ప్రతిపాదించింది.

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్‌ 9 నుంచి డిసెంబర్‌ 30 మధ్య ఒక వ్యక్తి ఒక అకౌంట్‌ లేదా అంతకుమించి అకౌంట్లలో రూ.2.5 లక్షలు లేదా ఆపైన డిపాజిట్‌ చేస్తే... ఆ వివరాలను తమకు అందించాలని నవంబర్‌లో తాను జారీ చేసిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని కూడా బ్యాంకింగ్‌కు తన తాజా నోటిఫికేషన్‌లో సూచించింది. కరెంట్‌ అకౌంట్‌ విషయంలో పరిమితి మొత్తం రూ.12.50 లక్షలు ఆపైన కావడం గమనార్హం. కార్పొరేట్‌ కంపెనీ, సహకార బ్యాంకులకూ తాజా నిబంధన వర్తిస్తుందని తెలిపింది.

సహకార బ్యాంకులపై లేఖ
ఇదిలావుండగా, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కొన్ని సహకార బ్యాంకుల అకౌంట్లలో తీవ్రమైన వైరుధ్యాలు, అవకతవకలు కనిపించినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కి ఆదాయపు పన్ను శాఖ ఒక లేఖ రాసింది. తమ విచారణలో ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు కనుగొన్నటువివరిం చింది. ముంబై. పూనేల్లో ఇం దుకు సంబంధించి రూ.113 కోట్ల అవకతవకలను గుర్తిం చినట్లు ఐటీ శాఖ తన విశ్లేషణా పత్రాల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ తరహా ఘటనలపై విశ్లేషణాత్మక నివేదికలను ఆర్థికశాఖ, ఆర్‌బీఐలకు ఐటీ శాఖ సమర్పించిందనీ, చర్యలకు విజ్ఞప్తి చేసిందనీ అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement