తెలుగు రాష్ట్రాల వైద్య విద్యార్థులకు శరాఘాతం
- ఈనెల 31 నాటికి హౌస్ సర్జన్ చేసిన వారికే పీజీలో అవకాశం
- మెడికల్ నోటిఫికేషన్ జారీచేసిన కర్ణాటక కో–మెడ్
- తెలుగు రాష్ట్రాలకు ఏప్రిల్ 15 వరకూ గడువు ఇవ్వాలని నీట్‌లో స్పష్టం
- నీట్ నిబంధనలనే పట్టించుకోని ఆయా రాష్ట్రాలు
- సీట్లు కోల్పోనున్న ర్యాంకులు పొందిన వైద్య విద్యార్థులు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల వైద్య విద్యార్థులకు శరాఘాతం. కో–మెడ్ కే(కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక) పీజీ వైద్య ప్రవేశాలకు వేలాది మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు అనర్హులు కాబోతు న్నారు. బుధవారం కోమెడ్ కె పీజీ నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో 2017 మార్చి 31వ తేదీలోపు హౌస్ సర్జన్(ఎంబీబీఎస్ పూర్త య్యాక) పూర్తి చేసిన వారు మాత్రమే దర ఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వైద్య విద్యార్థులకు 2017 ఏప్రిల్ 11తో హౌస్ సర్జన్ పూర్తవుతుంది. దీంతో బుధవారం విడుదలైన కోమెడ్ కె నోటిఫికేషన్ చూసి విద్యార్థులు విస్మయం వ్యక్తం చేశారు.
2017లో నీట్(జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) నిబంధనల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా ల వైద్య విద్యార్థులకు సడలింపునివ్వాలని, 2017 ఏప్రిల్ 15లోపు పూర్తయిన వారికి కూడా అవకాశం ఇవ్వాలని ఇచ్చింది. కానీ ఈ నిబం ధనలను తోసిరాజని కోమెడ్ కే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 9 నుంచి ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. నీట్‌లో ర్యాం కులు పొందిన వైద్య విద్యార్థులు ఈ నిబంధ నతో కోమెడ్ కెలో సీట్లు కోల్పోనున్నారు. కోమెడ్ కేతో పాటు కన్సార్టియం ఆఫ్ డీమ్డ్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక(ఇందులో 8 డీమ్డ్ వర్సిటీలు ఉన్నాయి) కూడా నోటిఫికేషన్ జారీచేసింది. ఈ వర్సిటీలు కూడా కోమెడ్ కే నిబంధనలనే అనుసరిస్తాయి.
తమిళనాడు, కర్ణాటకకు లేఖలు రాస్తున్నాం
వాస్తవానికి మనకు నీట్‌లో ఏప్రిల్ 15 వరకూ గడువు ఇచ్చారు. కానీ ‘కోమెడ్ కే’ ఇలా నోటిఫికేషన్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. తమిళనాడు కూడా ఇలాగే చేసింది. దీనిపై త్వరలోనే కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలకు లేఖలు రాస్తున్నాం. తెలుగు రాష్ట్రాల వైద్య విద్యార్థుల దరఖాస్తులను పరిశీలనలోకి తీసుకోవాలని కోరతాం.
– డా.ఎస్.అప్పలనాయుడు, రిజిస్ట్రార్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ