ముంబై:రెండేళ్ల క్రితం తొమ్మిది మంది మృతికి కారణమైన పుణే డ్రైవర్ సంతోష్ మానేకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పు ప్రకటించింది. 2012, జనవరి 25 వ తేదీన నైట్ డ్యూటీ నుంచి డే డ్యూటీకి వచ్చిన అతను ర్యాష్ డ్రైవింగ్ కారణంగా 9 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో అధికశాతం మందికి తీవ్ర గాయాలవ్వగా, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు కూడా ధ్వంసమైయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా అతనికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.