వై-ఫై నగరంగా హైదరాబాద్‌: కేటీఆర్ | Hyderabad turns Wifi City, says KTR | Sakshi
Sakshi News home page

వై-ఫై నగరంగా హైదరాబాద్‌: కేటీఆర్

Published Tue, Aug 26 2014 6:08 PM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

వై-ఫై నగరంగా హైదరాబాద్‌: కేటీఆర్

వై-ఫై నగరంగా హైదరాబాద్‌: కేటీఆర్

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆగస్టుకల్లా అన్ని ప్రభుత్వ పాఠశాల్లో మరుగుదొడ్లు నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, సమాచార సాంకేతికశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) తెలిపారు. 24 వందల గ్రామపంచాయితీలను ఈ-పంచాయితీలుగా మారుస్తున్నామని చెప్పారు. పెన్షన్లను ఈ-పంచాయితీలలో ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

హైదరాబాద్‌ను వై-ఫై నగరంగా మారుస్తామని అన్నారు. తమ రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు.  సమస్యలను సాధ్యమైనంత తర్వలో వాటిని అధిగమిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement