నేను హోం వర్కు చేస్తా.. ఆయన చేయరు! | I do home work, but he does not, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

నేను హోం వర్కు చేస్తా.. ఆయన చేయరు!

Published Tue, Sep 1 2015 12:01 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

నేను హోం వర్కు చేస్తా.. ఆయన చేయరు! - Sakshi

నేను హోం వర్కు చేస్తా.. ఆయన చేయరు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అసెంబ్లీలో జరిగిన చర్చలో మాటల తూటాలు పేలాయి. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడే సందర్భంలో.. ''మేం ఈ జనరేషన్, చంద్రబాబు పాత జనరేషన్. ఆయనకు తెలియని చాలా విషయాలు మాకు తెలుసు. మేం హోంవర్కు చేస్తాం.. ఆయన స్టడీ చేయరు, ఆయనకు ఓపిక లేదు'' అన్నారు. దాంతో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు లేచి తన సహజ శైలిలో పాత విషయాలు తవ్వితీస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బురద చల్లేందుకు ప్రయత్నించారు.

తన మీద ఉన్న కేసుల విషయమై హోం వర్కు చేస్తారన్నారు. దానికి వెంటనే వైఎస్ జగన్ దీటుగా స్పందించారు. చంద్రబాబు ఈమధ్య ఓటుకు కోట్లు కేసు గురించి ఎక్కువగా హోం వర్కు చేస్తున్నారని ఆయన అనగానే ఒక్కసారిగా సభ మొత్తం నవ్వులతో మునిగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement