‘75 ఏళ్లు దాటితే బ్రెయిన్‌డెడ్ అంటున్నారు’
ముంబై: ప్రధాని మోదీపై బీజేపీ సీనియర్ నేత యశ్వంత్‌సిన్హా విమర్శల వర్షం కురిపించారు. 75 ఏళ్ల వయసు దాటిన వారందరినీ బ్రెయిన్‌డెడ్ అయినట్టుగా మోదీ గత ఏడాది మే 26న ప్రకటించారని విమర్శించారు. 75 ఏళ్లు దాటిన వారు మంత్రి పదవికి అనర్హులుగా మోదీ పరిగణించడాన్ని సిన్హా బుధవారం ముంబైలో తప్పుబట్టారు. 75 ఏళ్ల వయస్సు పైబడిన వాళ్లలో బీజేపీ ప్రధాన నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శత్రుఘ్నసిన్హా వంటి వారికి మోదీ మంత్రి వర్గంలో స్థానం లభించలేదని, తానూ ఆ బ్రెయిన్ డెడ్ అయిన వారిలోనే ఉన్నానని సిన్హా అన్నారు.
మోదీ ప్రతిష్టాత్మకంగా పిలుపునిచ్చిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని కూడా సిన్హా విమర్శించారు. ప్రధాని ముందు భారత్‌ను నిర్మించాలని తర్వాత మిగతా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.