సోనిపట్: దేశం ఆర్థికంగా దూసుకుపోవడానికి మౌలిక వసతుల కల్పనే అత్యంత కీలకమని ప్రధానిమోదీ అన్నారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతులకు సంబంధించి రూ.4 లక్షల కోట్ల ప్రాజెక్టులను చేపట్టినట్లు వివరించారు. దేశంలో నేటికీ 18 వేల గ్రామాలు విద్యుత్ వెలుగులకు దూరంగా ఉన్నాయని, వాటన్నింటికీ కరెంటు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం హరియాణాలో హైవే ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సోనిపట్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
రాష్ట్రానికి రూ.32 వేల కోట్ల ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు తెలిపారు. ‘గత ఐదారు నెలల్లో పెండింగ్ ప్రాజెక్టులపై వివిధ రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి, రూ.4 లక్షల కోట్లతో వివిధ ప్రాజెక్టులను చేపట్టాం. సేతుభారతం కింద 375 బ్రిడ్జిలను నిర్మిస్తామని, సాగరమాల ద్వారా తీర పట్టణాల్లో పోర్టులను అభివృద్ధి చేస్తామని వివరించారు.
దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి
న్యూఢిల్లీ: విదేశాల నుంచి మనం భారీ ఎత్తున ఆయుధాలు, రక్షణ పరికరాలను దిగుమతి చేసుకుంటున్నామని... వాటిని దేశీయంగా ఉత్పత్తి చేసుకుంటే పదేళ్లలో రక్షణ బడ్జెట్ సగానికి తగ్గుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
మౌలిక రంగమే ‘కీ’లకం: మోదీ
Published Fri, Nov 6 2015 2:25 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM
Advertisement