Highway projects
-
అనంతపురం: హైవే ప్రాజెక్టుల హైస్పీడ్‌లో భూసేకరణ
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో జాతీయ రహదారి ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాలను కలపడంతో పాటు కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కలుపుతూ వివిధ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో భూసేకరణ చేపట్టారు. శ్రీసత్యసాయి జిల్లాలో 1,452 హెక్టార్లు, అనంతపురం జిల్లాలో 623 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. అధికార యంత్రాంగం ఇప్పటికే అనంతపురం జిల్లాలో 312 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించింది. శ్రీసత్యసాయి జిల్లాలో 216 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించారు. ఏడాదిన్నరలో ప్రాజెక్టులు పూర్తి చేసే విధంగా ముందుకెళుతున్నారు. రోడ్లతో పాటు పలు ప్రాంతాల్లో వంతెనలు కూడా ఉన్నాయి. ప్రాజెక్టులు మొత్తం 2024 సంవత్సరం చివరికల్లా పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు జిల్లాల్లోనూ మొత్తం 31 ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ జరుగుతోంది. వివిధ ప్రాజెక్టుల వివరాలు.. = ఉరవకొండ – అనంతపురం – కదిరి – మదనపల్లి – కుప్పం – కృష్ణగిరి వరకూ మొత్తం 197 కిలోమీటర్ల రోడ్డుకు సేకరణ పూర్తి చేయనున్నారు. = ధార్వాడ్ – హుబ్లి – గదగ్ –కొప్పలæ – హొసపేటె– బళ్లారి – గుత్తి – తాడిపత్రి – ముద్దనూరు – మైదుకూరు – బద్వేల్ – ఆత్మకూరు – నెల్లూరు – కృష్ణపట్నం వరకూ జాతీయ రహదారి–67లో మొత్తం 118 కిలోమీటర్లు చేపడుతున్నారు. = అనంతపురం – తాడిపత్రి – బనగానపల్లి – గాజులపల్లి – గిద్దలూరు – కంభం – వినుకొండ – నరసరావుపేట – గుంటూరు వరకూ జాతీయ రహదారి 544డీలో భాగంగా భూ సేకరణ చేపడుతున్నారు. = కొడికొండ – లేపాక్షి – హిందూపురం – మడకశిర వరకూ 544ఈ జాతీయ రహదారిలో 102 కిలోమీటర్ల రోడ్డు చేపడుతున్నారు. = ముదిగుబ్బ జంక్షన్ ఏర్పాటు చేస్తూ కనెక్టింగ్ ఏర్పాటులో భాగంగా పుట్టపర్తి మీదుగా ఎన్‌హెచ్–44లో కోడూరు వద్ద కలుపుతారు. = జాతీయ రహదారి ఎన్‌హెచ్ – 716లో ముద్దనూరు – పులివెందుల – కదిరి – ఓబుళదేవర చెరువు – గోరంట్ల – పాలసముద్రం క్రాస్ నుంచి హిందూపురం ఎన్‌హెచ్ 544ఈకి అనుసంధానిస్తారు. వేగంగా భూసేకరణ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మీదుగా ఏర్పాటవుతున్న పలు జాతీయ రహదారులకు భూసేకరణ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే చాలామటుకు పూర్తిచేశాం. ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఉన్నాయి. కొంత అటవీ భూములను కూడా డైవర్షన్ చేశారు. –మధుసూదన్‌రావు, ఈఈ, జాతీయ రహదారులు -
చరిత్రలో సరికొత్త ‘బాట’
సాక్షి, అమరావతి: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ముమ్మరంగా రోడ్ల మరమ్మతులు, నిర్వహణ, పునరుద్ధరణ, విస్తరణ, కొత్త హైవే ప్రాజెక్టులను చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. 8 వేల కిలోమీటర్ల నిడివి ఉన్న రోడ్ల మెయింటెనెన్స్ పనులు రూ.2,500 కోట్లతో ముమ్మరంగా జరుగుతుండగా ఇప్పటికే రూ.800 కోట్ల బిల్లులు చెల్లించామన్నారు. ‘నిడా’ (నాబార్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్) ద్వారా రూ.1,158 కోట్లు వెచ్చించి 720 కి.మీ. రహదారులను వెడల్పు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.700 కోట్లు బిల్లులు చెల్లించామని, జూన్ నాటికి ఈ పనులు పూర్తవుతాయని తెలిపారు. స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం దీనిపై సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. మే నెలలో పనులు ప్రారంభం సుమారు రూ.6,400 కోట్లతో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు సహాయంతో మండల కేంద్రాల నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రాలకు రోడ్లు వెడల్పు చేస్తున్నాం. మే నెలలో ఈ పనులు ప్రారంభం అవుతాయి. రెండో విడత పనులు డిసెంబరులో మొదలవుతాయి. రూ.1,017 కోట్లతో సుమారు 5 వేల కిలోమీటర్ల పంచాయితీరాజ్ రోడ్ల పనులను వచ్చే నెలలో ప్రారంభిస్తాం. జాతీయ రహదారుల కింద 99 ప్రాజెక్టులకు సంబంధించి సుమారు 3,079 కిలోమీటర్ల మేర పనులు చేçపడుతున్నాం. దీనికోసం దాదాపు రూ.29,249 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మరో 45 ప్రాజెక్టుల కింద సుమారు మరో 3 వేల కిలోమీటర్ల పనులు డీపీఆర్ దశ దాటాయి. ఇందుకు దాదాపు రూ.29 వేల కోట్లు వ్యయం కానుంది. ఇవికాకుండా ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ కింద ఆరు ప్రాజెక్టులకుగానూ నాలుగు ప్రాజెక్టుల టెండర్లు పూర్తయ్యాయి. పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు పనులు డిసెంబరులో ప్రారంభం అవుతాయి. జాతీయ రహదారులు, ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ కోసం మొత్తం రూ.90 వేల కోట్ల విలువైన పనులను రాష్ట్రంలో చేపడుతున్నాం. ఉపాధి అవకాశాలు విస్తృతం.. ఈ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగాలంటే భూ సేకరణ సకాలంలో పూర్తి కావాలి. దీనిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. వీటివల్ల ఉపాధి మెరుగుపడుతుంది. పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. భూ సేకరణలో ఎలాంటి జాప్యం ఉండకూడదు. దీనికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంత డబ్బు ఇదే తొలిసారి.. పనులు పూర్తి చేసిన రోడ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్లు పరిశీలించాలి. దీనివల్ల నాణ్యతపై పర్యవేక్షణ ఉంటుంది. చరిత్రలో ఇంత డబ్బు ఎప్పుడూ రోడ్ల కోసం ఖర్చు చేయలేదు. మరమ్మతులు, విస్తరణ, కనెక్టివిటీ... ఇలా పలు రూపాల్లో జరుగుతున్న పనులను ప్రజలకు తెలియచేయాలి. విద్య, ఆరోగ్యంపై రూ.32 వేల కోట్ల వ్యయం నాడు – నేడు పనుల కోసం భారీగా ఖర్చు చేస్తున్నాం. ఆరోగ్య రంగంపై దాదాపు రూ.16 వేల కోట్లు, విద్యారంగంలో మరో రూ.16 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. నాడు –నేడు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. మొత్తం 1,125 పీహెచ్‌సీల్లో 977 చోట్ల నాడు– నేడు కింద పనులు చేపట్టగా 628 ఆస్పత్రుల్లో పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల వేగవంతం చేయాలి. మరో 148 చోట్ల కొత్తవాటి నిర్మాణం చేపడుతున్నాం. 168 సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో కూడా పనులను వేగవంతం చేయాలి. మే 15 కల్లా అన్ని కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలు ప్రారంభం కావాలి. వచ్చే సమీక్ష నాటికి అన్ని బోధనాసుపత్రుల పనులు ప్రారంభం కావాలి. లేదంటే కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. 26,451 స్కూళ్లలో నాడు–నేడు రెండో దశ నాడు–నేడు రెండో దశ పనులను 26,451 స్కూళ్లలో చేపడుతున్నాం. దాదాపు రూ.8 వేల కోట్లకుపైగా నిధులను వెచ్చిస్తున్నాం. మే 2 నుంచి ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి నాడు– నేడు పనులు పూర్తైన దాదాపు 15 వేల స్కూళ్లను ప్రారంభిస్తారు. దీంతోపాటు రెండో దశ పనులను ప్రారంభిస్తారు. ఇందులో కలెక్టర్లు పాలుపంచుకోవాలి. పనులను చేపట్టే స్కూలు కమిటీలకు తోడుగా నిలవాలి. కొత్తగా 28 వేల తరగతి గదులను కూడా నిర్మిస్తాం. ఆస్పత్రులైనా, స్కూళ్లైనా నిర్వహణ బాగుండాలి. దీనిపై ప్రోటోకాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎం ముఖ్యసలహాదారు అజేయ కల్లం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయిప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పాల్గొన్నారు. -
ఏపీలో జాతీయరహదారుల అభివృద్ధి బలమైన పునాది
-
చైనాకు భారత్ మరో షాక్
-
చైనాకు భారత్ మరో షాక్
న్యూఢిల్లీ : చైనాకు భారత్ ప్రభత్వం మరోషాక్ ఇచ్చింది. ఇప్పటికే 59 చైనీస్ యాప్‌లపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం.. తాజాగా హైవే ప్రాజెక్టులో చైనా సంస్థలపై నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. హైవే ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలకు అనుమతి నిరాకరిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, వివిధ రంగాల్లో చైనా పెట్టుబడిదారులను ప్రభుత్వం ప్రొత్సహించదని చెప్పారు. త్వరలోనే హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనే చైనా సంస్థలపై నిషేధం విధించేలా ఓ విధానాన్ని తీసుకురాబోతున్నట్టు చెప్పారు. ఆ విధానంలో హైవే ప్రాజెక్టులో పాల్గొనేలా భారత కంపెనీల అర్హత ప్రమాణాలు పెంపొందించేలా నిబంధనల సడలింపు కూడా చేపడతామని వెల్లడించారు. ప్రస్తుతం భారత్-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
మౌలిక రంగమే ‘కీ’లకం: మోదీ
సోనిపట్: దేశం ఆర్థికంగా దూసుకుపోవడానికి మౌలిక వసతుల కల్పనే అత్యంత కీలకమని ప్రధానిమోదీ అన్నారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతులకు సంబంధించి రూ.4 లక్షల కోట్ల ప్రాజెక్టులను చేపట్టినట్లు వివరించారు. దేశంలో నేటికీ 18 వేల గ్రామాలు విద్యుత్ వెలుగులకు దూరంగా ఉన్నాయని, వాటన్నింటికీ కరెంటు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం హరియాణాలో హైవే ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సోనిపట్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రానికి రూ.32 వేల కోట్ల ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు తెలిపారు. ‘గత ఐదారు నెలల్లో పెండింగ్ ప్రాజెక్టులపై వివిధ రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి, రూ.4 లక్షల కోట్లతో వివిధ ప్రాజెక్టులను చేపట్టాం. సేతుభారతం కింద 375 బ్రిడ్జిలను నిర్మిస్తామని, సాగరమాల ద్వారా తీర పట్టణాల్లో పోర్టులను అభివృద్ధి చేస్తామని వివరించారు. దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి న్యూఢిల్లీ: విదేశాల నుంచి మనం భారీ ఎత్తున ఆయుధాలు, రక్షణ పరికరాలను దిగుమతి చేసుకుంటున్నామని... వాటిని దేశీయంగా ఉత్పత్తి చేసుకుంటే పదేళ్లలో రక్షణ బడ్జెట్ సగానికి తగ్గుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.