దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికాల్లో నివసించే స్లోత్ అనే జంతువు సెల్ఫీకి ఫోజిచ్చి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సాధారణంగా చెట్లపై నివసించే ఈ జీవులు మనుషులకు చాలా దూరంగా ఉంటాయి. అంతేకాదండోయ్ ! వీటికి సిగ్గు కూడా బాగా ఎక్కువ.
అలాంటిది దక్షిణ అమెరికాలో ట్రెక్కింగ్ చేస్తున్న నికోలస్ హస్కర్ అనే వ్యక్తితో ఏకంగా సెల్ఫీ దిగేసింది ఓ స్లోత్. దీంతో ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది. దాదాపు రెండు మిలియన్లకు పైగా లైక్ లు సంపాదించుకున్న ఈ పోస్టును ముద్దుగా 'స్లోఫీ' అని పిలుస్తున్నారు.