'వైద్యవిజ్ఞాన రంగంలో పెట్టుబడులు పెరగాలి'
బెంగళూరు: వైద్యవిజ్ఞాన రంగంలో భారత పెట్టుబడులు పెరగాలని భారత రత్న అవార్డు గ్రహీత సీఎన్ఆర్.రావు తెలిపారు. ప్రభుత్వం ఈ రంగంలో పెట్టుబడులు పెడితే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశంలో విజ్ఞాన శాస్త్రాన్ని పెంపుదించుకునేందుకు ప్రభుత్వంతో సహా, ప్రైవేటు సంస్థలు కూడా కృషి చేయాలని సూచించారు. ప్రధాని సాంకేతిక సలహాదారుని సంఘానికి చైర్మన్ గా ఉన్న ఆయనకు భారత ప్రభుత్వం శనివారం 'భారత రత్న' పురస్కారంతో సత్కరించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన భారత పెట్టుబడులు అంశంపై మాట్లాడారు.దేశంలోని పెట్టుబడులు వైద్యవిజ్ఞాన రంగంలో మరింత పెడితే యువత ఆకర్షితులవుతారని తెలిపారు. తద్వార భారత్ అభివృద్ధి పథంలో దూసుకెళుతుందన్నారు. ఈ రంగంలో కృషి చేసిన దేశాలు ముందు వరుసలో ఉన్నాయన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు.