భారత్-పాక్‌ల మాటల తూటాలు | India, Pakistan spar over purported 'Kashmir' remark | Sakshi
Sakshi News home page

భారత్-పాక్‌ల మాటల తూటాలు

Published Thu, Dec 5 2013 6:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

India, Pakistan spar over purported 'Kashmir' remark

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ‘కాశ్మీర్’పై భారత్-పాక్‌ల నడుమ బుధవారం మరోసారి మాటల తూటాలు పేలాయి. కాశ్మీర్ సమస్య ఏ సమయంలోనైనా భారత్‌తో నాలుగో యుద్ధానికి దారితీయవచ్చని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించినట్లు ‘డాన్’ దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ముజాఫరాబాద్‌లో ఆజాద్ జమ్మూ కాశ్మీర్ కౌన్సిల్ (ఏజేకే) బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన సందర్భంగా షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది. దీనిపై భారత ప్రధాని మన్మోహన్ సింగ్ దీటుగా స్పందించారు.

 

తన జీవితకాలంలో పాకిస్థాన్‌కు భారత్‌పై యుద్ధాన్ని గెలిచే పరిస్థితే లేదని వ్యాఖ్యానించారు. అయితే, ‘డాన్’లో ఈ విషయమై వచ్చిన కథనాన్ని పాక్ ప్రధాని కార్యాలయం ఖండించింది. ప్రధాని షరీఫ్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఆ కథనం పూర్తిగా నిరాధారమైనదని, దురుద్దేశపూరితంగా ఆ కథనాన్ని ప్రచురించారని ఆరోపించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement