ఒత్తిడి భారత్‌పైనే.. మైండ్‌గేమ్ ప్రారంభించిన పాక్!
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టుపైనే తీవ్ర ఒత్తిడి నెలకొని ఉందని, తమ జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ శనివారం పేర్కొన్నాడు. ఆదివారం దాయాదులు భారత్-పాకిస్థాన్ మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరగనున్న నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్ మెండ్‌గేమ్‌కు తెరతీశాడు.
'భారత జట్టు మాకన్నా మెరుగ్గా ఉందన్న విషయం నిజమే. కానీ ఇప్పుడు ఆట చాలా మారిపోయింది. మ్యాచ్ జరిగే రోజున ఎవరు బాగా ఆడితే వారు గెలుస్తారు. అంతేకాదు ట్రోఫీ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతుండటంతో భారత్‌పైనే సహజంగా ఒత్తిడి ఉంది' అని చెప్పాడు.
చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై పాకిస్థాన్‌కు 2-1తో ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. కానీ వన్డే వరల్డ్ కప్‌లోనూ, టీ-20 వరల్డ్ కప్‌లోనూ పాక్‌పై భారత్ ఆధిపత్యం. ఇప్పటివరకు వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్థాన్‌లు 11సార్లు తలపడగా.. 10-0తేడాతో టీమిండియా తిరుగులేని ఆధిక్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా భారత్ జట్టు ఇటీవల వరుసగా పది టెస్టు విజయాలను సాధించింది. అంతేకాకుండా చాంపియన్స్ ట్రోఫీ డిఫెండింగ్ చాంపియన్ కూడా టీమిండియానే. కాబట్టి దాయాదితో పోరులో భారత్‌పై ఎంతకొంత ఒత్తిడి ఉంటుంది. అటు బలహీనంగా ఉన్న పాక్ జట్టుపైనా తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది. కానీ ఒత్తిడి అంతా భారత్‌పైనే ఉందని, కాబట్టి తాము స్వేచ్ఛగా ఆడుతామని సర్ఫరాజ్ అహ్మద్ అంటున్నాడు. భారత్‌తో మ్యాచ్‌ను పురస్కరించుకొని అతను జట్టు కోచ్ మిక్ ఆర్థర్‌తో కలిసి మీడియాతో మాట్లాడాడు.