న్యూఢిల్లీ: దేశంలో అత్యంత వేగంగా నడిచే రైళ్లను ప్రవేశపెట్టే ముందు రైల్వే శాఖ తమ సిబ్బందిని శిక్షణ నిమిత్తం విదేశాలకు పంపిస్తోంది. ‘మిషన్ రాఫ్తార్’లో భాగంగా దాదాపు 500మంది అనుభవమున్న ట్రాఫిక్, ఎలక్ట్రికల్ ఉద్యోగులు చైనా, జపాన్ దేశాలకు వెళ్లనున్నారు. వీరంతా ఇప్పుడున్న గంటకు 120కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న రైళ్ల వేగాన్ని గంటకు 200కి.మీ వేగంతో నడిపేలా నైపుణ్యం సాధించనున్నారు.
శిక్షణ కాలం జపాన్‌లో రెండు వారాలు, చైనాలో ఇరవై రోజులు. అక్కడ హై స్పీడ్ రైళ్లు నడపడం, నిర్వహణ వంటి అంశాలపై తర్ఫీదు పొందనున్నారు. ఇప్పటికే మొదటి దఫా 40మంది చైనాలో, 20మంది జపాన్‌లో శిక్షణ పూర్తిచేసుకున్నారు. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ–హౌరా, ఢిల్లీ–ముంబై వంటి మార్గాల్లో ఈ హైస్పీడ్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని రైల్వే యోచిస్తోంది. హైస్పీడ్ రైళ్లు ఉపయోగించటం వల్ల సమయం ఆదాతో పాటు, ఎక్కువ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
రైల్వే ఉద్యోగులకు విదేశాల్లో శిక్షణ
Published Wed, Apr 19 2017 10:41 AM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM
Advertisement