ముంబయి: త్వరలోనే ఇంద్రాణి ముఖర్జియా పోలీసులకు స్టేట్మెంట్ ఇస్తుందని ఆమెను పర్యవేక్షిస్తున్న సీనియర్ డాక్టర్ టీపీ లహానే చెప్పారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుందని వైద్యులతో కూడా మాట్లాడుతోందని ఆయన వివరించారు. కన్న కూతురు షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉండి విచారణ నిమిత్తం జైలు అధికారుల కస్టడీలో ఉన్న ఇంద్రాణి మోతాదుకు మించిన మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే.
దీంతో ఆమెను జేజే ఆస్పత్రిలో చేర్పించగా ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షించింది. ప్రస్తుతం ఆ వైద్యుల అనుమతితోనే ఆమె డిశ్చార్జి అయ్యి పోలీసులకు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైద్యులు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేశారు. త్వరలోనే ఆమెను డిశ్చార్జి చేస్తామని, పోలీసులు వాంగ్మూలం నమోదు చేసుకోవచ్చని ఇప్పుడామె శరీరం అన్ని రకాలుగా సహకరిస్తుందని వివరించారు.
'ఇక ఇంద్రాణి స్టేట్ మెంట్ రికార్డు చేసుకోవచ్చు'
Published Tue, Oct 6 2015 9:53 AM | Last Updated on Sun, Sep 3 2017 10:32 AM
Advertisement