న్యూయార్క్: ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐఎస్) మిలిటెంట్ల ‘ట్విట్టర్’ ఖాతాలను తొలిగించినందుకుగాను తమ ఉద్యోగులను చంపేస్తామంటూ ఐఎస్ ఉగ్రవాదులనుంచి తమ ఉద్యోగులకు బెదిరింపు కాల్ప్ అందినట్టు ట్విట్టర్ సీఈఓ డిక్ కోస్టొలో వెల్లడించారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ వారం జరిగిన వ్యానిటీ ఫెయిర్ సదస్సులో కోస్టొలో మాట్లాడుతూ, ఐఎస్ ఉగ్రవాదులకు చెందిన టిట్టర్ ఖాతాలను తొలగించడం మెుదలుపెట్టగానే, తనకు, తమ ఉద్యోగులకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు.
ఐఎస్ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకోసం, సందేశాలు పంపించేందుకు ట్విట్టర్ సైట్‌ను విస్తృతంగా వినియోగించుకోవడంతో, ఇది సంస్థ నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొంటూ వారి ఖాతాలను, గ్రూప్ అకౌంట్లను తొలగించింది.