'మీరు12 జిల్లాలు రాసుకుంటే మేమేం చేస్తాం'
న్యూఢిల్లీ : పది జిల్లాలతో కూడిన తెలంగాణకు గతంలోనే కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం చిదంబరం విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాయల తెలంగాణా? అదెక్కడుంది? అని ప్రశ్నించారు.
పది జిల్లాల తెలంగాణకే కేబినెట్ ఆమోదం తెలిపిందని.... అయితే మీరు 12 జిల్లాలు రాసుకుంటే మేమేం చేస్తామని ఆయన మీడియాపై ఎదురుదాడికి దిగారు. రాయాల తెలంగాణపై మీడియాలో వస్తున్న వార్తలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి కార్యాలయంలో దిగ్విజయ్ సింగ్.... జీవోఎం సభ్యుడు జైరాం రమేష్, నారాయణ స్వామితో భేటీ అయ్యారు.