చారిత్రాత్మక గరిష్టంలో దలాల్‌ స్ట్రీట్‌ | It's party time on D-Street! Sensex, Nifty scale all-time highs | Sakshi
Sakshi News home page

చారిత్రాత్మక గరిష్టంలో దలాల్‌ స్ట్రీట్‌

Published Wed, May 10 2017 10:43 AM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM

It's party time on D-Street! Sensex, Nifty scale all-time highs

ముంబై: సరికొత్త  చారిత్రాత్మక గరిష్టాలతో దలాల్‌ స్ట్రీట్‌ మెరుపులు మెరిపిస్తున్నాయి. ఫ్రెష్‌ ఆల్‌ టైం హైలతో స్టాక్‌మార్కెట్లు దూసుకుపోతున్నాయి.  అంతర్జాతీయ సానుకూలత,  బెటర్‌ మాన్‌సూన్‌ సంకేతాలతో ఆరంభంలోనే సెంచరీ సాధించిన సెన్సెక్స్‌ మరింత  పాజిటివ్‌గా స్పందిస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 249 పాయిట్లు ఎగిసి 30, 182వద్ద  చాలా స్థిరంగా ఉంది.  అటు నిఫ్టీ కూడా 9400  స్థాయివైపు పరుగులు తీస్తోంది. 68 పాయింట్ల లాభంతో 9385 వద్ద కొనసాగుతోంది.  
ముఖ్యంగా  ఎఫ్ఎంసీజీ సెక్టార్  మార్కెట్లను లీడ్ చేస్తోంది.   నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా సరికొత్త రికార్డ్‌ స్థాయిని నమోదు చేసింది.  మిగిలిన అన్ని సెక్టార్లు  లాభాల్లో ఉన్నాయి.  కేపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్‌లు కూడా భారీగా లాభపడుతుండగా.. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సెక్టార్లలో ర్యాలీ కొనసాగుతోంది. హెచ్‌ యుఎల్‌ టాప్‌ విన్నర్‌గా ఉంది.   ఐటీసీ,  రిలయన్స్‌, ఎం అండ్‌ ఎం, భారతి, అదాని పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ,  వోల్టాస్‌,  హిందుస్తాన్ యూనిలీవర్, అరబిందో తదితర షేర్లు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. అయితే  ఐటీ, టెక్నాలజీ కౌంటర్లు మాత్రం ఫ్లాట్‌గా ఉన్నాయి. విప్రో, టీసీఎస్, గెయిల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement