న్యూఢిల్లీ: ప్రముఖ కార్ మేకర్ టాటా మోటార్స్ సొంతమైన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్ ) కొత్త ప్రీమియం కారును బుధవారం లాంచ్ చేసింది. తన ప్రీమియం ఎస్ యూవీ రేంజ్ రోవర్ ఎవోక్ పెట్రోల్ వేరియంట్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ 53,20 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించింది. 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 177 కెడబ్ల్యూ శక్తిని అందించే కొత్త పెట్రోల్ వేరియంట్ ఎవోక్. అయితే కంపెనీ ఇప్పటికే డిసెంబర్ 2016 నుంచి ఇండియాలో ఎస్ యూవీ వాహనాలను డీజిల్ వేరియంట్లలో విక్రయిస్తోంది.
అద్భుతమైన వాహన డ్రైవింగ్ అనుభవాన్ని కాంక్షించే వినియోగదారులకు శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్ వేరియంట్ ను అందించడంలో తమ నిబద్ధతను మరింత పటిష్టం చేసుకున్నట్టు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ అధ్యక్షుడు రోహిత్ సూరి ఒక ప్రకటనలో తెలిపారు.
కాగా భారతదేశం లో ల్యాండ్ రోవర్ పోర్ట్ఫోలియోలో డిస్కవరీ స్పోర్ట్ రూ 47.59 లక్షల ప్రారంభ ధరగా ఉంది. రేంజ్ రోవర్ స్పోర్ట్ రూ 1.18 కోట్లు, ఫ్లాగ్షిప్ రేంజ్ రోవర్ రూ 2.13 కోట్లుగా ఉంది. రేంజ్ రోవర్ ఎవోక్ (పెట్రోల్) తో పాటు 49.10 లక్షల ప్రారంభ ధరగా (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.