
'ట్రాఫిక్ ను వెంటనే క్లియర్ చేయండి'
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి పుష్కరాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆదివారం దృష్ట్యా పుష్కరఘాట్ల వద్ద పరిస్థితిపై మంత్రులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కేసీఆర్ ఆదేశించారు.
దీనిలో భాగంగా పుష్కర ఘాట్ల వద్ద ట్రాఫిక్ ను వెంటనే క్లియర్ చేయాలంటూ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీజీపీ బాసర నుంచి భద్రాచలం వరకూ హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు.