'ఢిల్లీలో ఎన్నికలు జరిపించండి' | Kejriwal meets president, demands fresh election in Delhi | Sakshi
Sakshi News home page

'ఢిల్లీలో ఎన్నికలు జరిపించండి'

Published Sat, Sep 6 2014 9:50 PM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM

'ఢిల్లీలో ఎన్నికలు జరిపించండి'

'ఢిల్లీలో ఎన్నికలు జరిపించండి'

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. శనివారం ఆయన ప్రణబ్‌ను కలుసుకుని ఈమేరకు వినతి పత్రం అందజేశారు. ఢిల్లీలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మీకు సిఫార్సు చేసినట్లు వార్తలు రావడంతో కేజ్రీవాల్ స్పందించారు. 'ఇది పార్టీ ఫిరాయింపులు, బేరసారాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని బహిరంగంగా ఆహ్వానించడమే’ అని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. కాగా, రహస్య బ్యాలెట్ ద్వారా సీఎంను ఎన్నుకోవచ్చన్న బీజేపీ వ్యాఖ్యలపై కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అది రాజ్యాంగానికి విరుద్ధమని రాజ్యాంగ నిపుణులు చెప్పారన్నారు.

 

ఫిబ్రవరిలో సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఢిల్లీ అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచడం తెలిసిందే. కాగా, ప్రభుత్వ ఏర్పాటు కోసం బేరసారాలకు దిగబోమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో తమదే పెద్ద పార్టీ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు తమకే ఉందని, దీనికి మద్దతు కోసం ప్రయత్నించడం అనైతికం కాదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి ప్రస్తుతం 28 మంది ఎమ్మెల్యేలున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement