సీఎం జంతువు కంటే నీచంగా వ్యవహరిస్తున్నారు
ఢిల్లీ: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జంతువు కంటే నీచంగా వ్యవరిస్తున్నారని ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆయన అర్హుడు కాకపోయినా సీఎం పదవిని కట్టబెట్టి తప్పుచేశారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన అంశంపై కిరణ్ డ్రామాలాడుతున్నారని పొన్నం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయానికి అమలు చేస్తున్నానని చెబుతూ వచ్చిన కిరణ్ ఇప్పడు మాట మారుస్తున్నారని విమర్శించారు.ఆయన ఏం మాట్లాడుతన్నారో అర్థం కావడంలేదని, జంతువు కంటే నీచంగా ప్రవర్తిస్తున్నారని దుమ్మెత్తు పోశారు.
మరో ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సీఎం వైఖరిని తప్పబట్టారు. స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీనే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిందని... ఆ పార్టీనే కాదనుకుంటే కిరణ్ కలలో కూడా సీఎం అవ్వలేరని వ్యాఖ్యానించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులను సంప్రదించకుండా కేంద్రమంత్రుల బృందానికి (జీవోఎం) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో పలు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు.