హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గే ప్రసక్తే ఉండదని తెలంగాణ ఎంపీలు స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి ఎంపీలు మధుయాష్కి, పొన్నం ప్రభాకర్‌లు బుధవారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంత్రం(యూటీ)గా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలిపారు.
సీమాంధ్ర మంత్రులు సమైక్య ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. అవసరమైతే సీఎం కిరణకుమార్ రెడ్డి, రాష్ట్రపతి పాలన విధించైనా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందన్నారు. విభజనకు మద్దతు లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకుందని వారు మండిపడ్డారు.