కోదండరాం ఉద్యమ కార్యాచరణ!
హైదరాబాద్: రాష్ట్రంలోని రైతు సమస్యలపై పోరుబాట పట్టాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. ఈ విషయంలో కేసీఆర్ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. త్వరలో 'ఛలో హైదరాబాద్' కార్యక్రమాన్ని రైతులతో పెద్ద ఎత్తున చేపడతామని టీజేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 2న గాంధీ సమాధి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో మౌనదీక్ష చేపడతామని చెప్పారు. రైతు రుణాలను వెంటనే మాఫీ చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఒక్కరోజు మొత్తం అసెంబ్లీలో వ్యవసాయం అంశంపైనే ప్రభుత్వం చర్చించాలన్నారు. నిర్వాసిత రైతులకు భూమికి పరిహరంగా భూమి ఇవ్వాలని కోరారు.