సరైన సమయంలో పార్టీపై నిర్ణయం | Deciding on the party at the right time | Sakshi
Sakshi News home page

సరైన సమయంలో పార్టీపై నిర్ణయం

Published Mon, Jan 1 2018 2:58 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

Deciding on the party at the right time - Sakshi

మంచిర్యాల క్రైం: పార్టీ ఏర్పాటుపై సరైన సమయంలో.. సరైన నిర్ణయం తీసుకుంటామని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. ఆదివారం మంచిర్యాలలో రైతు జేఏసీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందని, ఈ క్రమంలో పార్టీ ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ జరుగుతోందని కోదండరాం చెప్పారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని, రైతుల సమస్యలపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. రైతుల సమస్యలపై పోరాటం చేసేందుకే ప్రత్యే కంగా రైతు టీజేఏసీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  అసలు రాష్ట్రంలో ప్రజాసంక్షేమాన్ని కాపాడే పాలకులున్నారా.. లేక దోపిడీదొంగలున్నారా.. అనే అనుమానం కలుగుతోందని అన్నారు. లంబాడీ, ఆదివాసీల వివాదంలో ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని విమర్శించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement