మహిళా ప్రొఫెసర్ దారుణ హత్య | lady professor found murdered at residence | Sakshi
Sakshi News home page

మహిళ ప్రొఫెసర్ దారుణ హత్య

Published Tue, Jan 21 2014 11:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

lady professor found murdered at residence

కళాశాలలో ప్రొఫెసర్గా పని చేస్తున్న మహిళ (30) దారుణ హత్యకు గురైన సంఘటన ఈరోడ్లోని సుబ్రమణ్యనగర్లో చోటు చేసుకుంది. ప్రొఫెసర్ ఇంట్లోని పని మనిషి స్థానికులు సహయంతో మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే మహిళ ఒంటిపై ఉన్న నగలు చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయని పోలీసులు తెలిపారు.

 

దాంతో ప్రొఫెసర్ హత్యపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య నిన్న రాత్రి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా హత్యకు గురైన యువతికి సంబంధించిన వివరాలను స్థానికులకు అడిగి తెలుసుకున్నారు. భర్త మెడికల్ రిప్రజెంటేటీవ్గా పని చేస్తున్నారని, అలాగే హత్యకు గురైన యువతి తిరుచన్గోడ్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు స్థానికులు వెల్లడించారు. ఈ కేసులో భర్తను విచారించవలసి ఉందని పోలీసులు తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement