Erode
-
గుండెలను పిండేసే ఘటన.. ఆకలి చావులు, అలమటించిన బతుకులు
అంతులేని ఆకలి.. వర్ణించనలివికాని దైన్యం.. భరించలేని ఆవేదన.. ఇవన్నీ గత కొన్ని నెలలుగా ఆ కుటుంబం అనుభస్తున్న బాధలు. చివరికి తమ వారు మరణించినా కాటికి చేర్చలేని దుస్థితి వారిది. ఇంటి నుంచి వస్తున్న దుర్శాసన భరించలేక స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేస్తేకానీ.. వారి దుర్భర జీవితం బయటి ప్రపంచానికి తెలియలేదు. చెన్నై: ఆకలితో అలమటించి ఓ వృద్ధురాలు, మరో వ్యక్తి వారం రోజుల క్రితం మరణించారు. ఈ మృత దేహాలకు అంత్యక్రియలు చేసే స్థామత లేక తాము కూడా ఆకలితో చచ్చి పోదామని భావించిన ఓ తల్లి, తనయుడు వారం పాటు ఒకే గదిలో కాలం గడిపారు. ఇంట్లో నుంచి వచ్చిన దుర్వాసతో సోమవారం పోలీసులు రంగంలోకి దిగారు. మృత దేహాలను పోస్టుమార్టంకు తరలించి, తల్లి, కుమారుడిని ఆసుప్రతికి తరలించారు. వివరాలు.. ఈరోడ్ జిల్లా గోబి చెట్టి పాళయం వండి పేట కుమరన్ వీధికి చెందిన కనకంబాల్ (80), ఆమె కుమార్తె శాంతి (60), అల్లుడు మోహన సుందరం(74)తో ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. శాంతి, మోహన సుందరం దంపతులకు కుమార్తె శశిరేఖ(27), కుమారుడు శరవణ కుమార్(23) ఉన్నారు. ఈక్రమంలో కనకంబాల్, సుందరం, శాంతి అనారోగ్యం, వయోభారం సమస్యలతో బాధ పడుతున్నారు. కుమారుడు శరవణకుమార్ మానసిక ఎదుగుదల లేనివాడు. ఈక్రమంలో ఆ కుటుంబాన్ని శశిరేఖ పోషిస్తూ వచ్చింది. ఇటీవల ఆమెకు వివాహం చేసి కాంగేయానికి పంపించేశారు. అప్పటి నుంచి ఆదాయం లేక పేదరికంతో పస్తులు ఉన్న రోజులే ఈ కుటుంబానికి ఎక్కువ. వారం పాటు శవజాగారం ఇరుగు పొరుగు వారు ఏదైనా ఇస్తే తినడం లేదా, నీళ్లు తాగి పడుకోవడం చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో వీరి ఇంటి నుంచి సోమవారం దుర్వాసన రావడాన్ని ఇరుగు పొరుగు వారు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా, మోహన సుందరం, కనకంబాల్ మరణించి ఉండటం, వారి మృత దేహాల పక్కనే శాంతి, శరణ కుమార్ కూర్చుని ఉండడం చూసి విస్మయం చెందారు. అత్యంత దీన స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించారు. విచారణలో ఆ ఇద్దరు మరణించి వారం రోజులు అయినట్లు తేలింది. ఆకలితో అలమటించి ఆ ఇద్దరు మరణించారని, అంత్యక్రియలకు స్థోమత కూడా లేదని, తాము చచ్చిపోతామని భావించే వారం నుంచి ఇంట్లోనే ఉన్నట్లు శాంతి పేర్కొనడం పోలీసుల్ని సైతం కంట తడి పెట్టించింది. దీంతో కనకాంబాల్ , మోహన్ సుందరం మృత దేహాలకు పోస్టుమార్టం అనంతరం పోలీసులే అంత్యక్రియలు చేశారు. కాంగేయంలో ఉన్న కుమార్తె శశిరేఖకు సమాచారం అందించారు. ఆమె కూడా కూలీ నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తుండటంతో ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
బరిలో నువ్వుంటే.. ప్రత్యర్థి నేనే!
సాక్షి, చెన్నై: ఈరోడ్ తూర్పు నియోజవర్గం ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమా..? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు సినీ నటి గాయత్రి రఘురాం సవాల్ విసిరారు. పోటీ చేస్తే, ప్రత్యర్థిగా తాను రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు. వివరాలు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన సినీ నటి గాయత్రి రఘురాం మధ్య జరుగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నామలైను టార్గెట్ చేసి గాయత్రి తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. సోమవారం ట్విట్టర్ వేదికగా అన్నామలైకు ఆమె ఓ సవాలు విసిరారు. ఈరోడ్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుమగన్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం ప్రసుత్తం ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో ఉప ఎన్నికలకు కసరత్తు మొదలైంది. ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ కుటుంబం హవా నడుస్తుండటం, మరణించిన ఎమ్మెల్యే తిరుమగన్ ఆయన కుమారుడు కావడం గమనార్హం. దీంతో ఆయన కుటుంబం నుంచి ఉప ఎన్నికల బరిలో ఎవరైనా దిగుతారేమోననే చర్చ పెద్దఎత్తున జరుగుతోంది. అదే సమయంలో బీజేపీ తన బలాన్ని చాటుకునేందుకు సిద్ధమైంది. ఈ నియోజకవర్గ కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు అన్నామలై నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు సవాల్ విసురుతూ గాయత్రి ట్విట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉప ఎన్నికలలో పోటీకి ధైర్యం ఉందా..? ఉంటే పోటీకి స్వయంగా సిద్ధం కావాలని అన్నామలైను కోరారు. ఉప ఎన్నిక బరిలో అన్నామలై ఉంటే ప్రత్యరి్థగా తాను ఉంటానని స్పష్టం చేశారు. ఆయన నాటకాలు, కపట ప్రచారాలు ఢిల్లీ పెద్దలు నమ్మవచ్చేమోగానీ ఇక్కడ చెల్లవని వ్యాఖ్యానించారు. తాను తమిళనాడు ఆడ బిడ్డనని, అన్నామలై తమిళగం పుత్రుడు అని పేర్కొన్నారు. తమిళనాడు గొప్పదా..? తమిళగం.. గొప్పదా..? అనేది తేల్చుకుందాం రా.. అంటూ ట్వీట్ చేశారు. -
రాగి ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, నెయ్యి ఇడ్లీ, కాంచీపురం ఇడ్లీ... ప్రతి ఉదయం 10 వేలు!
రాగి ఇడ్లీ.. రవ్వ ఇడ్లీ.. నెయ్యి ఇడ్లీ.. కాంచీపురం ఇడ్లీ... జయలలిత ఇడ్లీ.. పూల సంతలాగా పండ్ల సంతలాగా ఇడ్లీల హోల్‌సేల్ సంత. తమిళనాడు ఈరోడ్‌లోని కరుంగల్ పాళ్యంలో దాదాపు స్త్రీలే నడిపే 35 హోటళ్ల సంత ఇది. రోజుకు 10 వేల ఇడ్లీలు అమ్ముతారు. పెళ్లిళ్ల సీజన్లో 40 వేల ఇడ్లీలు. నలభై ఏళ్ల క్రితం ఇద్దరు స్త్రీలు మొదలెట్టిన ఈ సంత నేడు దాదాపు స్త్రీల చేతుల మీదుగానే నడుస్తోంది. స్త్రీల చేతుల్లో తయారవుతున్న మల్లెపూల వంటి ఇడ్లీల విజయగాథ ఇది. రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి పసుపు కొనడానికి వర్తకులు ఈరోడ్‌కు వస్తారు. తమిళనాడులోని పెద్ద ఊరు అది. ఆ వర్తకం పని అయిపోతుంది. ఉదయాన్నే ఆటో మాట్లాడుకుని 150 రూపాయలు ఇచ్చి అక్కడికి 14 కిలోమీటర్లు ఉన్న కరుంగల్ పాళ్యానికి మరుసటి రోజు పొద్దున్నే వస్తారు. అక్కడ ఇడ్లీ సంత ఉంటుంది. ఉదయం 5 నుంచి తొమ్మిదిన్నర లోపు ముగిసిపోయే సంత. అనుక్షణం వేడి వేడి ఇడ్లీ ఈలోపు. రెండిడ్లీ 7 రూపాయలు. 150 ఖర్చు పెట్టుకొని మరీ వచ్చి ఆ ఏడు రూపాయల ఇడ్లీ తింటారు. కరుంగల్ పాళ్యం ఇడ్లీ అంటే అంత రుచి. అంత డిమాండ్. ఊళ్లో పొలిటికల్ పార్టీ మీటింగ్ ఉంటుంది. తమ కార్యకర్తల కోసం 200 ప్లేట్ల ఇడ్లీ ఆర్డర్ కరుంగల్ పాళ్యంకు వెళుతుంది. ఇంట్లో శుభకార్యం ఉండి బంధువులు వస్తారు. టిఫిన్‌కు వంద ఇడ్లీలు అవసరం అవుతాయి. కరుంగల్ పాళ్యంకు వెళితే రెడీ. పెళ్లి ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్‌లో పొంగల్, ఉప్మా మనం వొండుకుంటాం. ఇడ్లీ మాత్రం కరుంగల్ పాళ్యం నుంచి రావాల్సిందే. ఇంకా విశేషం ఏమిటంటే ఈరోడ్‌లో చాలా పెద్ద హోటళ్లు ఉన్నాయి. ఇవి ఉదయాన్నే కరుంగల్ పాళ్యం నుంచి హోల్‌సేల్‌లో ఇడ్లీ తెచ్చుకుని తమ చట్నీ, సాంబారులతో కస్టమర్లకు రెట్టింపు రేట్‌కు అమ్ముకుంటాయి. కరుంగల్ పాళ్యంలో రోజుకు ప్రతి ఉదయం 6 నుంచి 9 లోపు పదివేల ఇడ్లీలు అమ్ముతారు. ఎలక్షన్లు ఉన్నా, పెళ్ళిళ్ల సీజన్ అయినా ఈ సంఖ్య నలభై వేలు. మొత్తం 40 లోపు వరుస షాపులున్నాయి అక్కడ. మొత్తం స్త్రీలే నిర్వహిస్తారు. మగవాళ్లు సహాయం చేస్తారు. ఇడ్లీ ఉడికే పాత్రల్లో ఒకే సమయంలో ఇద్దరు ఆడవాళ్లు పిండి నింపడం ఇక్కడే చూస్తాం. ఇలాంటి ఇడ్లీ సంతను కూడా ఇక్కడే చూస్తాం. విఫలం నుంచి విజయం వైపు నిజానికి ఇది ఒక వైఫల్యం నుంచి మొదలైన విజయగాథ. నలభై ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో నేత పని కార్మికులు జీవించేవారు. ఆ సమయంలోనే ఈరోడ్‌లో మిషన్ క్లాత్ ఉత్పత్తి మొదలైంది. దాని దెబ్బకు నేత పని మూలపడింది. శ్రీరంగన్ అనే నేత కార్మికుడు ఎడ్ల బండి మీద సరుకులు వేసే కూలీగా మారాడు. ఇది అతని భార్య చెల్లమ్మాళ్ను బాధించింది. ఆమె అతనికి సహాయంగా నాలుగు డబ్బులు సంపాదించడం కోసం ఇంటి ముంగిట్లో ఉదయాన్నే ఇడ్లీలు వేయడం మొదలెట్టింది. ఆ రోజుల్లో ఆ ప్రాంతం పల్లె. ఎవరూ ఉదయం టిఫెన్ ఇడ్లీ తినేవారు కాదు. కాని చెల్లమ్మాళ్ చుట్టుపక్కల డాక్టర్లను కలిసింది. జబ్బు చేసిన వారిని ఉదయం ఇడ్లీ తినమని డాక్టర్లు చెప్పడం అప్పుడే మొదలైంది. ‘మా షాపు గురించి చెప్పండయ్యా’ అని చెల్లమ్మాళ్ వారిని కోరితే వారు సరేనన్నారు. అలా ఆమె ఇడ్లీలకు గిరాకీ మొదలైంది. ఆ సమయంలోనే మరో నేత కార్మికుని భార్య ధనపకియం కూడా ఇడ్లీ వేయడం మొదలెట్టింది. కాలక్రమంలో అక్కడి ఇడ్లీల రుచికి టౌన్ నుంచి వెతుక్కుంటూ రావడం మొదలెట్టారు. చెల్లమ్మాళ్కు ఐదుగురు కూతుళ్లు. అందరూ పెళ్లిళ్లు అయిన వెంటనే ఇడ్లీ అంగళ్లు తెరిచారు. ధనపకియం బంధువులు... అంతా కలిసి దాదాపు 40 అంగళ్లుగా అవి ఎదిగాయి. రుచికరమైన ఇడ్లీ తక్కువ ధర... ఈ మంత్రంతో వారు గెలిచారు. కరుణానిధి నుంచి జయలలిత వరకు ఈరోడ్‌కు రాజకీయ నాయకుడు ఎవరు వచ్చినా లేదా ఆ దారి మీదుగా వెళుతున్నా ఉదయాన్నే కరుంగళ్ పాళ్యం ఇడ్లీ తెప్పించుకుని లేదా ఆగి తినాల్సిందే. కరుణానిధి, జయలలిత ఇలా తిన్నవారిలో ఉన్నారు. సినిమాస్టార్లు, వర్తకులు, సామాన్యులు వారూ వీరూ అని లేదు. ఇక్కడ కూడా సీజన్‌ను బట్టి కొత్తరకం ఇడ్లీని తయారు చేస్తారు. తమిళనాడులో కుష్బూ ఊపు మీద ఉన్నప్పుడు ‘కుష్బూ ఇడ్లీ’ అమ్మారు. జయలలిత పేరుతో కూడా ఇడ్లీ ఉంది. ‘మేము అరిటాకులో చుట్టకుండా ఇడ్లీ ఇవ్వం’ అని ఇక్కడ 30 ఏళ్లుగా ఇడ్లీ అమ్ముతున్న మల్లిక అంది. ‘నాన్‌స్టిక్ ఇడ్లీ గిన్నెల్లో కొంతమంది ఇడ్లీలు ఉడికిస్తారు. కాని మేము సంవత్సరాలుగా తడి గుడ్డ మీదే ఇడ్లీ ఉడకబెడతాం. అందుకే మా ఇడ్లీ రుచి’ అని మరొకామె అంది. ఈరోడ్ చుట్టుపక్కల ఉత్సవాలు, వేడుకలు, తిరునాళ్లు జరుగుతుంటే కరుంగళ్ పాళ్యం నుంచి టీమ్‌లు అన్ని సరుకులు, గిన్నెలు ట్రాలీలో వేసుకుని అవసరమైతే ఐదు పది రోజులు ఉండి ఇడ్లీలు అమ్ముతాయి. వీళ్లొచ్చి స్టాల్ పెట్టారంటే ఆ ఉత్సవానికే గ్లామర్ వస్తుంది. తినేవారి పక్షం అయితే వీరికి కూడా కష్టాలు లేకపోలేదు. వంట చెరుకు, వంట నూనె, గ్యాస్ సిలిండర్, మినప్పప్పు ధరలు పెరిగినప్పుడల్లా వీరి ఆదాయానికి గండి పడుతుంది. కస్టమర్ కోసం వీరు వెంటనే ఇడ్లీ రేటు పెంచరు. క్వాలిటీ తగ్గించరు. ‘ఏం చేస్తాం... కస్టమర్లను వదులుకోలేము కదా’ అంటారు. కరుంగళ్ పాల్యం స్త్రీలు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరి ఆడపిల్లలకు దిగులూ చింతా లేదు. పెళ్లి అవడంతోటే అల్లుడు ఇక్కడికే వచ్చి ఒక ఇడ్లీ షాపు తెరుస్తాడు. దూరంగా తల్లి, దగ్గరలో కూతురు ఉదయాన్నే హడావిడిగా ఇడ్లీలు పొట్లాలు కట్టే మనోహర దృశ్యం ఇక్కడే కనిపిస్తుందంటే నమ్మండి. ఎప్పుడైనా ఈరోడ్‌కు వెళితే ఈ ఇడ్లీల సంగతి మర్చిపోవద్దు. చదవండి: Sirimiri Nutrition Food: ఓ ఇల్లాలి వినూత్న ఆలోచన.. కట్‌చేస్తే.. కోట్లలో లాభం! -
20 మంది ప్రాణాలు కాపాడి.. గుండెపోటుతో మృతి
సేలం/తమిళనాడు: విధుల్లో ఉన్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుండెపోటుతో ఆదివారం మృతిచెందారు. గుండెనొప్పి రాగానే బస్సును డ్రైవర్ చాకచక్యంగా నిలిపివేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈరోడ్ జిల్లా కౌందంపాడికి చెందిన సెల్వరాజ్ (52) ప్రభుత్వ బస్సు డ్రైవర్. ఆదివారం ఉదయం 7.30 గంటలకు కౌందంపాడి నుంచి పెరుందురైకి 20 మంది ప్రయాణికులతో వెళుతున్నారు. మార్గమధ్యంలో సెల్వరాజ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో బస్సును రోడ్డు పక్కన ఆపి కండక్టర్‌కి విషయం చెప్పాడు. ప్రయాణికులు సెల్వరాజ్‌ను మరో వాహనంలో సిరువల్లూరు పీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యు లు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. సిరు వల్లూరు పోలీసులు మృతదేహాన్ని గోపిచెట్టి పాళయం ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ ప్రాంతంలో పర్యటించిన మొదటి ప్రధాని మోదీనే
సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నడ్డా అన్నారు. శ్రీలంకలోని జాఫ్నాలో పర్యటించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్రమోదీనేనని చెప్పారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఈరోడ్‌లో జరిగిన రోడ్ షోలో ఈ విషయాన్ని గుర్తు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జాఫ్నాలో బాంబ్ దాడి నిర్వాసితులకు కేంద్రం సాయం చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా జాఫ్నాలో పర్యటించలేదన్నారు. అక్కడ పర్యటించడమే కాకుండా బాంబు దాడి నిర్వాసితులకు ఇళ్లు నిర్మించుకోవడానికి సహాయం చేశారని నడ్డా గుర్తు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న మైనారిటీలైన తమిళులు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. భారతదేశపు తొలి మహిళా రక్షణ మంత్రిగా ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ - ఇద్దరూ తమిళనాడుకు చెందినవారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తమిళనాడులో భూకబ్జాలను,గూండాయిజం, విద్యుత్ కోతలు ఆగాలంటే అన్నాడీఎంకే-బీజేపీ అభ్యర్థులను ఎన్నుకోవాలని నడ్డా ఓటర్లను అభ్యర్థించారు. కాగా, ఏప్రిల్ 6న తమిళనాడు, కేరళలో ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 2న జరుగనుంది. ( చదవండి: TN Assembly Polls: కొత్త ఈవీఎంలే ఉపయోగిస్తాం ) -
అన్నాడీఎంకే నేతలకు భారీ షాక్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని పెరుందురైలో గ్రానైట్ రాళ్ల దోపిడీకి పాల్పడిన కేసులో ఇద్దరు అన్నాడీఎంకే నేతలకు ఈరోడ్ కోర్టు రూ.8 కోట్ల జరిమానా విధించింది. ఈరోడ్ జిల్లా పెరుందురై తాలూకా పరిధిలో మట్టి, గ్రానైట్ రాళ్లను అక్రమంగా తరలించినట్లు పెరుంగుడి సహకార బ్యాంక్ అధ్యక్షుడు, అన్నాడీఎంకే నేత సేనాపతితోపాటు మరో నేత సుబ్రహ్యణ్యంలపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిని విచారించిన కోర్టు రూ.కోటి 96 లక్షల 56 వేలు జరిమానా చెల్లించాలని గతంలో ఆదేశించింది. అయితే వీరిద్దరూ జరిమానా చెల్లించకుండా అప్పీల్ చేశారు. ఈ అప్పీల్‌ను అనుసరించి పెరుందురై భూముల్లో కోర్టు డిజిటల్ సర్వే చేయించింది. 78,405 యూనిట్ల మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తరలించినట్లు తేలడంతో ఈరోడ్ కోర్టు న్యాయమూర్తి నర్మదాదేవి వారిద్దరికీ రూ.8 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. -
రైలు ఇంజిన్‌లో పొగలు
కేకే.నగర్: జోలార్‌పేట నుంచి ఈరోడ్‌కు పెరంబూర్ మార్గంలో వచ్చిన ప్యాసింజర్ రైలులో హఠాత్తుగా ఇంజిన్ నుంచి పొగలు ప్రారంభమయ్యా యి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు రెండు గంటల తరువాత అధికారులు మరో ఇంజిన్‌ను రప్పించి రైలును నడిపారు. వే లూరు జిల్లా జోలార్‌పేట నుంచి ఈరోడ్‌కు ఉదయం 6.40 గంటలకు ప్యా సింజర్ రైలు బయలుదేరుతుంది. ఎప్పటిలాగా మంగళవారం ఆరు గం టలకు జోలార్‌పేట నుంచి రైలు బయలుదేరింది. మోదాపూర్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో వస్తుండగా ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడడంతో నిలిచి పోయింది. ఇంకా ఇంజిను నుంచి పొగలు ప్రారంభమయ్యాయి. సమాచా రం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ముందు జాగ్రత్తగా నీటిని చల్లారు. తరువాత కొంతదూరం రైలును నడిపి వేరే మార్గంలో నిలిపారు. రెండు గంటల తరువాత మరో ఇంజిన్‌ను రప్పించి రైలును నడిపారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. -
తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ
ఈరోడ్ : ఓ రిటైర్డ్ టీచర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 60 కాసుల బంగారు ఆభరణాలు, రూ.20 లక్షల నగదును గుర్తుతెలియని దుండగులు అపహరించుకుపోయారు. ఈ సంఘటన తమిళనాడులోని ఈరోడ్‌లో సత్యమంగళం రాజీవ్‌నగర్‌లో చోటుచేసుకుంది. రాజీవ్‌నగర్‌కు చెందిన జోసెఫ్(62) కుటుంబసభ్యులతో కలిసి చెన్నైకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం ఆయన ఇంటికి తిరిగివచ్చారు. ఇంటికి రాగానే ముందు తలుపులు పగులగొట్టి సంఘటనను గుర్తించిన జోసెఫ్ షాక్‌కు గురయ్యారు. ఏమి జరిగిందో అని హడావుడిగా ఇంట్లోకి వెళ్లి చూడగా, అల్మారాలో దాచిపెట్టిన 60 కాసుల బంగారు ఆభరణాలు, రూ. 20 లక్షల నగదు చోరీకి గురైనట్టు గుర్తించారు. వెంటనే జోసెఫ్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు , స్పెషల్ టీమ్స్‌తో రంగంలోకి దిగారు. మహిళ మెడలో చైన్ చోరీ ఈ గ్రామానికి 40 గ్రామానికి దూరంలో ఉన్న సిరువలూర్ గ్రామంలో మరో సంఘటన చోటుచేసుకుంది. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పార్వతి అనే మహిళ మెడలో 9 కాసుల గోల్డ్ చైన్ లాక్కొని పారిపోయారు. పార్వతి గత సాయంత్రం టూ-వీలర్‌పై సిరువలూర్ గ్రామ సమీపంలో వెళ్తూ ఉండగా.. అటుగా మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె వెహికిల్‌కు డాష్ ఇచ్చారు. కిందపడిపోయిన ఆమె మెడలోంచి ఓ వ్యక్తి చైన్‌ను లాగగా.. మరోవ్యక్తి బైక్‌ను వేగంగా పోనిచ్చాడు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. -
పసుపు తవ్వె యంత్రం రెడీ
వ్యవసాయాన్ని వేధిస్తున్న సమస్యల్లో కూలీల కొరత ప్రధానమైంది. పండించే పంట ఏదైనా మొక్కనాటిన నుంచి కలుపుతీత, సస్యరక్షణ, నూర్పిడి వరకు మనిషి ప్రమేయం ఉండాల్సిందే. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి సాగు చేయాలంటే దేశీ మార్కెట్లో అందుబాటులో ఉన్న యంత్రాలు సాధారణ రైతాంగానికి అందుబాటు ధరల్లో లేవు. ఐదారెకరాల్లోపు కమతాలున్న రైతులు లక్షలు వెచ్చించి భారీ యంత్రాలను కొనుగోలు చేసి వినియోగించే పరిస్థితి లేదు. పసుపు తవ్వకం వ్యయప్రయాసలతో కూడుకున్న పని. దీన్ని సులభతరం చేయ డానికి తమిళ రైతు రామరాజు కొత్త యంత్రాన్నే తయారు చేశారు. తమిళనాడులో పసుపు పండించే ప్రాంతాల్లో ఈరోడ్ జిల్లా ఒకటి. పసుపుసాగులో ముఖ్యఘట్టం దుంపల తవ్వకం. దుంపలు తవ్వి ఉడికించి ఎండబెట్టాలి. అప్పుడే మార్కెట్‌కు అనుగుణమైన పసుపు కొమ్ములు సిద్ధమవు తాయి. దుంపలు తవ్వితీయడమే అత్యంత కష్టమైన పని. దీనికి ఎక్కువ మంది కూలీల అవసరం ఉంటుంది. ఆ సమయంలో కూలీల కొరత వల్ల కూలీ రేట్లు కూడా పెరుగుతాయి. దీంతో ఖర్చు అసలుకన్నా కొసరుకెక్కువన్నట్లు పంటకాలం మొత్తానికి చేసిన ఖర్చుకన్నా దుంప తవ్వకానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. 2009లో తొలి ప్రయత్నం.. ఈరోడ్ జిల్లా కొత్తూంగర్ తోట్టోర్ పుదుపాల్యంకు చెందిన రైతు రామరాజు సేద్యంలో ఈ సమస్యలన్నిటినీ ఎదుర్కొన్నాడు. బాల్యం నుంచి వ్యవసాయ వృత్తిలోనే ఉన్న రామరాజుకు వివిధ పంటల సాగులో వివిధ దశల్లో వచ్చే సమస్యల పట్ల సవ్యమైన అవగాహన ఉంది. ఈ పరిస్థితిలో సాగు ఖర్చును తగ్గించేందుకు యంత్రపరికరాలను ఉపయోగించడమే శరణ్యమని భావించిన రామరాజు.. స్వ యంగా పసుపు తవ్వే యంత్రాన్ని తయారు చేయడానికి పూనుకున్నాడు. తొలుత 2009లో పది ఆశ్వ శక్తి గల పవర్ టిల్లర్‌ను ఉపయోగించి, దానికి ఒక బ్లేడ్ మూడు కర్రులు జత చేసి తవ్వకం పని చేశాడు. అయితే ఇది అనుకున్నంత మెరుగైన ఫలితం ఇవ్వలేదు. దీంతో 2011లో మరోప్రయత్నం చేశాడు. పాత యంత్రాన్ని ఆధునీకరించి మరో కొత్త పరికరాన్ని రూపొందించాడు. ఇది మంచి ఫలితాన్నిచ్చింది. దీనితో 95% దుంపలు, కొమ్ములు ఏమా త్రం దెబ్బతినకుండా తవ్వగలిగాడు. మినీ టిల్లర్‌తో కూడి న ఈ హర్వెస్టర్‌ను చూసిన రైతులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. మైరాడ కృషి విజ్ఞాన కేంద్రం ఈ పరికరాన్ని పరిశీలించి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రామరాజుకు ఫౌండేషన్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది. - సాగుబడి డెస్క్ రైతులు నేరుగా రామరాజును గానీ లేదా ఫౌండేషన్‌ను గానీ సంప్రదించవచ్చు: నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, శాటిలైట్ కాంప్లెక్స్, ఎన్ఆర్ మన్సీ క్రాస్‌రోడ్స్, అహ్మదాబాద్ - 380015, గుజరాత్. bd@nifindia.org 22 అంగుళాల వెడల్పున తవ్వుతుంది.. పవర్ టిల్లర్ పీటీఓ షాఫ్ట్‌కు, పుల్లి, బెల్ట్ ద్వారా ఈ పరికరం అనుసంధానమై ఉంటుంది. ఓ పొడవైన బ్లేడ్‌కు మొనదేలి ఉండే కర్రులాంటి మూడు కమ్ములు బిగించి ఉంటాయి. టిల్లర్‌ను నడపడం మొదలు కాగానే పీటీఓ షాఫ్ట్ ద్వారా శక్తిని అందుకొని పుల్లీ ద్వారా హర్వెస్టింగ్ బ్లేడ్‌కు శక్తిని సరఫరా చేస్తుంది. నేల స్వభావాన్ని బట్టి ఈ యంత్రాన్ని రెండు వేగ పరిమితులతో వినియోగించుకోవచ్చు. ఒకేసారి 22 అంగుళాల వెడల్పున తవ్వుకుంటూ వెళ్లగలుగుతుంది. నేల స్వభావాన్ని బట్టి యంత్రం కర్రులు నేలలోకి దిగేలోతును సవరించుకోవచ్చు. కిందికి మీదికి కదులుతూ సాగే కర్రులు పసుపు దుంపలను తవ్వగా బ్లేడ్ వేరుచేస్తుంది. కనిష్టంగా గంటకు 20 సెంట్ల విస్తీర్ణంలో పసుపు దుంపలను దీని ద్వారా తవ్వుకోవచ్చు. గంటకు 1.5 లీటర్ల డీజిల్‌ను వినియోగించుకుంటుంది. పరికరం ఖరీదు రూ. 32 వేలవుతుంది. రైతులు ఆర్డరు ఇచ్చిన 15 రోజుల్లో ఈ పసుపు తవ్వే యంత్రాన్ని తయారు చేసి అందించగలను. - పి. రామరాజు,కొత్తూంగార్ తోట్టోర్ పుదుపాల్యం,కెట్టిసుమిందరం పోస్టు, భవానీ తాలుకా,ఈరోడ్ జిల్లా, తమిళనాడు ఫోన్: 04256 291941, 098651 71790 -
పూజారిపై దాడి.. ఆలయ సామగ్రి ధ్వంసం
తమిళనాడులోని ఈరోడ్‌లో జైన దేవాలయం పూజారిపై ముగ్గురు వ్యక్తులు దాడిచేసి, ఆలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ముఠా సభ్యుల్లో ఒకరు కారులో రాగా మరో ఇద్దరు ద్విచక్రవాహనాల మీద వచ్చారు. ముగ్గరుఇలో ఒకరు బాగా తప్పతాగి ఆలయంలోకి వస్తుండగా పూజారి ఆపి ప్రశ్నించారు. వెంటనే అతడు పూజారిపై తనవద్ద ఉన్న సీసాతో దాడి చేయడంతో ఆయన ఎడమ చెవికి తీవ్రగాయమైంది. అనంతరం ఆ ముఠా సభ్యులు లోపలున్న సామగ్రిని ధ్వంసం చేశారు. అయితే అదృష్టవశాత్తు గర్భగుడి తలుపులు మాత్రం తాళం వేసి ఉండటంతో వాళ్లు ఆ లోపలికి ప్రవేశించలేకపోయారని పోలీసులు తెలిపారు. ఇక్కడ గొడవ విన్న స్థానికులు వెంటనే అక్కడకు రావడంతో ముగ్గురూ మోటారు సైకిళ్ల మీద పారిపోయారు. నిందితులను అరెస్టు చేయాలంటూ స్థానికులు రోడ్డుమీద బైఠాయించి ధర్నా చేశారు. -
మహిళా ప్రొఫెసర్ దారుణ హత్య
కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మహిళ (30) దారుణ హత్యకు గురైన సంఘటన ఈరోడ్‌లోని సుబ్రమణ్యనగర్‌లో చోటు చేసుకుంది. ప్రొఫెసర్ ఇంట్లోని పని మనిషి స్థానికులు సహయంతో మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే మహిళ ఒంటిపై ఉన్న నగలు చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయని పోలీసులు తెలిపారు. దాంతో ప్రొఫెసర్ హత్యపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య నిన్న రాత్రి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా హత్యకు గురైన యువతికి సంబంధించిన వివరాలను స్థానికులకు అడిగి తెలుసుకున్నారు. భర్త మెడికల్ రిప్రజెంటేటీవ్‌గా పని చేస్తున్నారని, అలాగే హత్యకు గురైన యువతి తిరుచన్గోడ్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు స్థానికులు వెల్లడించారు. ఈ కేసులో భర్తను విచారించవలసి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు వివరించారు. -
మైనర్‌పై అత్యాచారం:నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష
తమిళనాడు ఈరోడ్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు మురుగేశన్కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రిన్సిఫల్ జడ్జి సతీష్ కుమార్ శుక్రవారం తీర్పు వెలువరించారు. దానితోపాటు రూ.10 వేల జరిమాన కూడా విధించారు. గతేడాది మార్చిలో మైనర్‌పై ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో మురుగేశన్ అత్యాచారం చేశారు. దాంతో ఆ బాలిక తన తల్లితండ్రులకు విషయాన్ని తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.పోలీసులు కేసు నమోదు చేసి, పరారిలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. దీంతో నిందితుడికి జైలు శిక్ష విధించారు. -
14 ఏళ్లుగా 8 గ్రామాలు దీపావళీ పండగకు దూరం!
పక్షులను ప్రేమించే ఎనిమిది గ్రామాలు ఎంతో సంతోషంగా జరుపుకునే దీపావళీ పండగకు దూరంగా ఉంటున్నారు. కేవలం పక్షుల రాక ఆగిపోతుందనే కారణంతో గత పద్నాలుగేళ్లుగా తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఎనిమిది గ్రామాలు దీపావళీ పండగ రోజున టపాసులను కాల్చకపోవడం గమనార్హం. ఈరోడ్ కు 15 కిలోమీటర్ల దూరంలోని వెల్లోడ్ పక్షలు సంరక్షణ కేంద్రానికి సమీపంలోని ఎనిమిది గ్రామాల్లోని సుమారు 750 గ్రామాల కుటుంబాలు దీపావళీ పండగకు దూరంగా ఉంటున్నాయి. అక్టోబర్-జనవరి మాసంలో వేలాది పక్షులు తమ గ్రామాలను సందర్శిస్తాయని మనిక్కం అనే స్థానికుడు వెల్లడించారు. దీపావళి సమయంలో టపాసులు కాల్చడం వలన పక్షులు బెదిరిపోతాయనే కారణంగా గత 14 ఏళ్లలో ఎనిమిది గ్రామాల్లో బాణసంచా, టపాసులు కాల్చడం లేదు అని తెలిపారు. అంతేకాకుండా మిగితా పండగ రోజుల్లో కూడా ప్రజలు బాణసంచా కాల్చడానికి దూరంగా ఉంటారని స్థానికులు తెలిపారు. దీపావళి పండగ రోజున కొత్త దుస్తులు ధరించి.. సంరక్షణ కేంద్రానికి వెళ్లి పక్షులకు, చేపలకు ధాన్యం వేస్తామని తెలిపారు. దీపావళి సందర్భంగా శనివారం రోజున సుమారు 2 వేల మంది సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు.