14 ఏళ్లుగా 8 గ్రామాలు దీపావళీ పండగకు దూరం!
Published Sun, Nov 3 2013 4:28 PM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
పక్షులను ప్రేమించే ఎనిమిది గ్రామాలు ఎంతో సంతోషంగా జరుపుకునే దీపావళీ పండగకు దూరంగా ఉంటున్నారు. కేవలం పక్షుల రాక ఆగిపోతుందనే కారణంతో గత పద్నాలుగేళ్లుగా తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఎనిమిది గ్రామాలు దీపావళీ పండగ రోజున టపాసులను కాల్చకపోవడం గమనార్హం.
ఈరోడ్ కు 15 కిలోమీటర్ల దూరంలోని వెల్లోడ్ పక్షలు సంరక్షణ కేంద్రానికి సమీపంలోని ఎనిమిది గ్రామాల్లోని సుమారు 750 గ్రామాల కుటుంబాలు దీపావళీ పండగకు దూరంగా ఉంటున్నాయి.
అక్టోబర్-జనవరి మాసంలో వేలాది పక్షులు తమ గ్రామాలను సందర్శిస్తాయని మనిక్కం అనే స్థానికుడు వెల్లడించారు. దీపావళి సమయంలో టపాసులు కాల్చడం వలన పక్షులు బెదిరిపోతాయనే కారణంగా గత 14 ఏళ్లలో ఎనిమిది గ్రామాల్లో బాణసంచా, టపాసులు కాల్చడం లేదు అని తెలిపారు. అంతేకాకుండా మిగితా పండగ రోజుల్లో కూడా ప్రజలు బాణసంచా కాల్చడానికి దూరంగా ఉంటారని స్థానికులు తెలిపారు.
దీపావళి పండగ రోజున కొత్త దుస్తులు ధరించి.. సంరక్షణ కేంద్రానికి వెళ్లి పక్షులకు, చేపలకు ధాన్యం వేస్తామని తెలిపారు. దీపావళి సందర్భంగా శనివారం రోజున సుమారు 2 వేల మంది సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు.
Advertisement