రాయబార కార్యాలయానికి లెటర్ బాంబు
ఇటలీ రాజధాని రోమ్ నగరంలోని ఫ్రెంచి రాయబార కార్యాలయానికి లెటర్ బాంబు ఒకటి వచ్చింది. ఇది ఎవరు పంపారో ఇంకా తెలియడంలేదు. దీనిపై విచారణ ప్రారంభమైంది. రోమ్ నగరంలోని చరిత్రాత్మక ప్రాంతమైన పలాజో ఫార్నెసె వద్ద ఉన్న రాయబార కార్యాలయానికి ఈ లెటర్ బాంబు బుధవారం మధ్యాహ్నం వచ్చింది.
సాధారణంగా రోజూ ఇక్కడకు వచ్చే ఉత్తరాలను సార్టింగ్ చేసే ఉద్యోగిని దాన్ని తెరిచారు. ఆమె అలా తెరవగానే వెంటనే చిన్నపాటి పేలుడు సంభవించి మంటలు వచ్చాయి. ఆ కవర్ను పారేసి దూరంగా పారిపోయానని, అదృష్టవశాత్తు ఆ మంటలు తన చేతులకు గానీ, కళ్లకు గానీ అంటుకోలేదని ఆమె తెలిపింది. వెంటనే భవనాన్ని ఖాళీ చేశారు. దాంతో ఇక మీదట ఎలాంటి లేఖలను ముందస్తు పరీక్షలు లేకుండా ముట్టుకోకూడదని ఉద్యోగులందరికీ చెప్పారు.