letter bomb
-
ఇలియానాకు లేఖ రాసిన ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ మహిళకు ఆన్ లైన్ మెయిల్ చేశారు. ఇందులో విశేషం ఏముంది.. అందరూ తరచుగా ఎన్నో మెయిల్స్ చేస్తుంటారని భావిస్తున్నారు కదా.. ఇక్కడో విశేషం ఉంది. 50 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి క్యూబా దేశానికి వచ్చిన తొలి మెయిల్ కావడం గమనార్హం. ఈ రెండు దేశాల మధ్య ఎన్నో దశాబ్దాల నుంచి సంబంధాలు అంత మంచిగా లేవన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో క్యూబాకు చెందిన ఇలియానా యార్జా అనే మహిళ అమెరికా అధ్యక్షుడికి ఓ లేఖ పంపింది. ఆ లేఖ గమ్యస్థానానికి చేరిందని తెలిసి క్యూబా ఎంతగానో పులకించిపోయింది. అందరికంటే ఇలియానా చాలా సంతోషపడింది. బరాక్ ఒబామాను క్యూబా కాఫీ రుచి చూసేందుకు రావాలని ఫిబ్రవరి 18న తన లేఖ ద్వారా అహ్వానిస్తూ రాసిన లేఖకు ఆయన నుంచి బుధవారం సమాధానం వచ్చింది. హవానాలోని తన ఇంటికి రావాలని ఒబామాను ఆమె కోరారు. తాను ఈ ఆదివారం క్యూబాకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఒబామా తన మెయిల్ లో పేర్కొన్నారు. తనను ఆహ్వానించినందుకు ఆ మహిళకు ధన్యవాదాలు తెలిపారు. 50 ఏళ్ల తర్వాత మన రెండు దేశాల మధ్య ఉత్తర, ప్రత్యుత్తరాలు జరగడంతో సంబంధాలు మెరుగవుతాయని చెబుతూ ఈ పని చేసినందుకు ఆమెను అభినందించారు. క్యూబా కాఫీ రూచి చూడాలని ఆశపడుతున్నానని వెల్లడించారు. 1928 తర్వాత ఆ ద్వీపానికి వెళ్తున్న తొలి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా అరుదైన ఘనత సొంతం చేసుకోనున్నారు. ఆరో దశకంలో న్యూయార్క్ నుంచి క్యూబాకు లెటర్ బాంబు వచ్చిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య లెటర్ సేవలు రద్దయిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు అవి మొదలయ్యాయి. -
రాయబార కార్యాలయానికి లెటర్ బాంబు
ఇటలీ రాజధాని రోమ్ నగరంలోని ఫ్రెంచి రాయబార కార్యాలయానికి లెటర్ బాంబు ఒకటి వచ్చింది. ఇది ఎవరు పంపారో ఇంకా తెలియడంలేదు. దీనిపై విచారణ ప్రారంభమైంది. రోమ్ నగరంలోని చరిత్రాత్మక ప్రాంతమైన పలాజో ఫార్నెసె వద్ద ఉన్న రాయబార కార్యాలయానికి ఈ లెటర్ బాంబు బుధవారం మధ్యాహ్నం వచ్చింది. సాధారణంగా రోజూ ఇక్కడకు వచ్చే ఉత్తరాలను సార్టింగ్ చేసే ఉద్యోగిని దాన్ని తెరిచారు. ఆమె అలా తెరవగానే వెంటనే చిన్నపాటి పేలుడు సంభవించి మంటలు వచ్చాయి. ఆ కవర్ను పారేసి దూరంగా పారిపోయానని, అదృష్టవశాత్తు ఆ మంటలు తన చేతులకు గానీ, కళ్లకు గానీ అంటుకోలేదని ఆమె తెలిపింది. వెంటనే భవనాన్ని ఖాళీ చేశారు. దాంతో ఇక మీదట ఎలాంటి లేఖలను ముందస్తు పరీక్షలు లేకుండా ముట్టుకోకూడదని ఉద్యోగులందరికీ చెప్పారు.