రాహుల్ గాంధీపై భోపాల్ లో కేసు నమోదు!
గిరిజన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీపై మధ్యప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రభాత్ ఝా స్థానిక కోర్టులో కేసు నమోదు చేశారు. అక్టోబర్ 17న షాదోల్ జిల్లాలో జరిగిన ర్యాలీలో గిరిజన మహిళల మనోభావాలు దెబ్బ తినేవిధంగా రాహుల్ మాట్లాడారని.. ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరం అని ఫస్ట్ క్లాస్ కోర్టు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ విశాల శర్మకు పిటిషన్ అందచేశారు. రాహుల్ వ్యాఖ్యలు గిరిజనులను అవమానించే విధంగా ఉన్నాయని ప్రకాశ్ విమర్శించారు. పిటిషన్ స్వీకరించి ప్రభాత్ ఝా స్టేట్ మెంట్ ను రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది.