మహారాష్ట్ర కేబినెట్లోకి 11మందికి చోటు | Maharastra CM Fadnavis inducts ten new ministers, promotes one junior minister to cabinet rank | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర కేబినెట్లోకి 11మందికి చోటు

Published Fri, Jul 8 2016 9:55 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

Maharastra CM Fadnavis inducts ten new ministers, promotes one junior minister to cabinet rank

ముంబయి: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మరో 11మందికి చోటు దక్కింది. వారిలో పదిమంది కొత్త ముఖాలే. మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొత్తగా ఎంపికైన మంత్రులతో గురువారం ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ విద్యాసాగరరావు ప్రమాణ స్వీకారం చేయించారు.  కాగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే గైర్హాజరు అయ్యారు. కొత్త మంత్రివర్గంలో మిత్ర పక్షాలు అయిన శివసేనకు రెండు సహాయ మంత్రి పదవులు, స్వాభిమాని పక్ష పార్టీతో పాటు రాష్ట్రీయ సమాజ్ పార్టీకి  చోటు దక్కింది.

కాగా అవినీతి ఆరోపణలతో సీనియర్ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే గత నెల రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  ఖడ్సే నిర్వహించిన 10 శాఖలను అప్పటి నుంచి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటివరకూ తన వద్దే ఉంచుకున్నారు.

కేబినెట్ మంత్రులు
1.పాండురంగ్ పుండ్కర్ (బీజేపీ)
2. రామ్ షిండే, (బీజేపీ) కేబినెట్ హోదా
3.జయకుమార్ రావల్ (బీజేపీ)
4. సంభాజీ పాటిల్-నిలంబగేకర్ (బీజేపీ)
5.సుభాష్ దేశ్ముఖ్ (బీజేపీ)
6.మహదేవ్ జాన్కర్ (ఆర్ఎస్పీ)

సహాయమంత్రులు
1. అర్జున్ ఖోత్కర్ (శివసేన)
2. రవీంద్ర చవాన్ (బీజేపీ)
3. మదన్ యారవాల్ (బీజేపీ)
4. గులాబ్ రావ్ పాటిల్ (శివసేన)
5. సదాభావు ఖోత్, (ఎస్ఎస్ఎస్‌)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement