ఇక మేక్ ఇన్ ఇండియా కీచెయిన్లు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని గురించి అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వేలకొద్దీ షర్ట్ పిన్నులు, కీ చెయిన్లను పంచాలని యోచి స్తోంది. 5,000 మేక్ ఇన్ ఇండియా షర్టు పిన్నులు, సింహం లోగోతో 2,500 మేక్ ఇన్ ఇండియా యాక్రిలిక్/మెటల్ కీ చెయిన్ల తయారీ కోసం పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కొటేషన్లను ఆహ్వానించింది. ఇత్తడితో తయారు చేసే షర్ట్ పిన్నులపై పుత్తడి కోటింగ్ ఉండాలని, కీ చెయిన్లను మెటల్ లేదా యాక్రిలిక్ మెటీరియల్‌తో తయారు చేయాల్సి ఉంటుందని సూచించింది.