పాక్ లో మలాలా పుస్తకం నిషేధం | Malala's book banned by private schools in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్ లో మలాలా పుస్తకం నిషేధం

Published Sun, Nov 10 2013 8:56 PM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM

పాక్ లో మలాలా పుస్తకం నిషేధం

పాక్ లో మలాలా పుస్తకం నిషేధం

తాలిబాన్ ఉగ్రవాదుల తూటాలకు ఎదురొడ్డిన సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ రాసిన 'ఐ యామ్ మలాలా' పుస్తకాన్ని పాకిస్తాన్ లో నిషేదించారు.

ఇస్లామాబాద్ : తాలిబాన్ ఉగ్రవాదుల తూటాలకు ఎదురొడ్డిన సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ రాసిన 'ఐ యామ్ మలాలా' పుస్తకాన్ని పాకిస్తాన్ లో నిషేధించారు. ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని పెంచినా పాక్ లో మాత్రం నిషేధం ఎదుర్కొంటుంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ ప్రైవేటు స్కూల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు మిర్జా కసిఫ్ బ్రిటీష్ డైలీకి ఇచ్చిన ఓ నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రచురణలో ఉన్న పుస్తకం పాకిస్తాన్ బాలలను భయందోళనలకు గురి చేసేలా ఉందని ఆయన తెలిపారు.

 

దేశ వ్యాప్తంగా ఉన్న 1,52,000 పాఠశాలల్లో ఈ పుస్తకం ప్రవేశ పెట్టాలంటే  సమీక్ష తప్పకుండా జరపాలన్నారు. ఈ క్రమంలోనే ఆ పుస్తకాన్ని తాత్కాలికంగా నిలిపివేసామన్నారు. కాగా, ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటి వరకూ నిషేదం విధించలేదని, ఈ అంశంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తాలిబన్ల దాడి తనపై చేసిన దాడిని పుస్తక రూపంలోకి తీసుకువచ్చి బాలల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని మలాలా చేసిన ప్రయత్నం ఆచరణలోకి వచ్చేటట్లు కనబడుట లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement