విమానం గాల్లో ఉండగానే పైలెట్ మృతి | Malaysian plane's co-pilot dies during flight | Sakshi
Sakshi News home page

విమానం గాల్లో ఉండగానే పైలెట్ మృతి

Published Wed, Aug 20 2014 6:16 PM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

విమానం గాల్లో ఉండగానే పైలెట్ మృతి

విమానం గాల్లో ఉండగానే పైలెట్ మృతి

బ్యాంకాక్: విమానం గాలిలో ప్రయాణిస్తుండగానే కో పైలెట్ కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన మలేషియా బడ్జెట్ ఎయిర్ లైన్స్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగినపుడు ఈ విమానంలో 152 మంది ప్యాసింజర్లు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. థాయ్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. 
 
కో పైలెట్ కుప్పకూలారని తెలుసుకుని.. లయన్ ఎయిర్ ఫ్లైట్ ఎస్ఎల్ 8537 ను వెనక్కి రప్పించి హత్ యాయ్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాడింగ్ చేశారు. ల్యాండిగ్ కాగానే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో 152 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement