Lion Air flight
-
‘మాటలకు అందని విషాదం.. కానీ నవ్వుతూనే ఉండాలి’
‘ప్రాణం కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నా.. నువ్వు లేకపోతే నేను బతకలేను.. నీ ఙ్ఞాపకాలతో జీవితాంతం బతికేస్తా.. ’సాధారణంగా ప్రతీ ప్రేమ జంట చేసుకునే బాసలు ఇవి. అయితే నిజమైన ప్రేమికులు మాత్రమే ఈ బాసల్ని నిలబెట్టుకుంటారు. నిలువెత్తు ప్రేమకు నిదర్శనంగా నిలుస్తారు. ఇండోనేషియాకు చెందిన సయారా కూడా ఈ కోవకు చెందిన వారే. అందుకే తనకు కాబోయే భర్త భౌతికంగా దూరమైనప్పటికీ తన మనసులో మాత్రం సజీవంగా ఉన్నాడని భావిస్తున్నారు. అతడి ఙ్ఞాపకాలతోనే జీవిస్తున్నారు. ఇండోనేషియాకు చెందిన సయారా, డాక్టర్ నంద ప్రతామా చిన్ననాటి స్నేహితులు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల అనుమతి పొందిన అనంతరం.. నవంబరు 11న పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇందుకోసం పంగ్కల్ పినాంగ్ సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. పెళ్లి బట్టలు కూడా కొనేశారు. ఈ క్రమంలో... నందా జకార్తాలో జరిగే ఓ కాన్ఫరెన్స్‌కు వెళ్లాల్సి వచ్చింది. కానీ అదే వారి పాలిట శాపంగా మారింది. విమాన ప్రమాదంలో నందా మరణించడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. అసలేం జరిగిందంటే.. అక్టోబరు 29న జకార్తా నుంచి పంగ్కల్ పినాంగ్ సిటీకి బయల్దేరిన లయన్ ఎయిర్ జెట్ విమానం జావా సముద్రంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. బయల్దేరిన 13 నిమిషాలకే చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 189 మంది మరణించారు. ఇంతవరకు వారిలో చాలా మంది ఆనవాళ్లు కూడా లభించలేదు. వారిలో నందా కూడా ఒకరు. ఈ ఘటన సయారా జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పది రోజుల్లో పెళ్లి జరుగుతుందని ఎన్నో కలలుగన్న ఆమెకు ఊహించని షాక్ ఇచ్చింది. నువ్వు చెప్పావు కదా.. అందుకే ఇలా.. కాన్ఫరెన్సు ముగించుకున్న తర్వాత జకార్తా నుంచి బయల్దేరే ముందు నందా సయారాకు ఫోన్ చేశాడు. ప్రమాదాన్ని ముందే ఊహించాడో ఏమో... అందుకే తానెంతో ముచ్చట పడి కొన్న పెళ్లి గౌనులో ఫొటోలు దిగి తనకు పంపించాలని కోరాడు. సరేనన్న సయారా... నందా కోసం వెడ్డింగ్ గౌన్ వేసుకుని, తెల్ల గులాబీలతో కూడిన బొకే చేతిలో పట్టుకుని పెళ్లికూతురిలా అలంకరించుకుని.. ఆ ఫొటోలను నందాకు పంపింది. ఇదంతా జరిగిన కొన్ని గంటల తర్వాత నందా ప్రయాణించే విమానం సముద్రంలో గల్లంతయ్యిందనే వార్త సయారా ఆశల్ని చిదిమేసింది. నందా ఇక లేడన్న విషయం తెలిసి ఆమె స్పృహ తప్పి పడిపోయింది. తను లేకుంటేనేం.. నందా తనకు భౌతికంగా దూరమయ్యాడే తప్ప తన మనసులో సజీవంగానే ఉన్నాడు కదా భావించిన సయారా... నవంబరు 11న తమ పెళ్లి జరగాల్సి ఉండటంతో మరోమారు పెళ్లి దుస్తులు ధరించి ఫొటోలు దిగింది. ‘మాటలకు అందని విషాదం నాది. కానీ నీ కోసం నేను నవ్వుతూనే ఉండాలి. ఏడుపు ముఖంతో ఉండాలనుకోవడం లేదు. ధైర్యంగా ఉండాలని నువ్వు చెప్పావు కదా. అలానే ఉన్నాను’ అనే క్యాప్షన్‌తో సయారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. 26 ఏళ్ల ప్రాయంలో సయారా జీవితంలో చోటుచేసుకున్న విషాదం నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. ఆమెకు వచ్చిన కష్టం పగవాళ్లకు కూడా రావొద్దంటూ వారు తమ సానుభూతి తెలియజేస్తున్నారు. -
విమాన ప్రమాదం: అది ఫేక్ న్యూస్
జకార్తా: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌కు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తప్పుడు వార్తలను ట్రెండ్ చేస్తూ చాలామందిని తప్పుదోవ పట్టిస్తున్నారు. గత సోమవారం ఇండోనేసియాలో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో 189 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ పసిపాప ప్రాణాలతో బయటపడిందని ఓ వార్త గత రెండు రోజులుగా హల్చల్ చేస్తోంది. ఆ పసిపాకు సంబంధించిన ఫొటో కూడా విపరీతంగా ట్రెండ్ అయింది. ప్రమాదం జరిగిన 24 గంటల్లోనే ఈ వార్తకు సంబంధించిన పోస్ట్ ఐదు వేల సార్లు షేర్ కావడం గమనార్హం. (చదవండి: సముద్రంలో కూలిన విమానం) ఈ పోస్ట్‌లో .. ‘ఈ పాపను రక్షించిన ఆ దేవుడికి కృతజ్ఞతలు. జేటీ610 విమాన ప్రమాదంలో బతికిన చిన్నారి. ఆమె తల్లి లైఫ్ జాకెట్‌తో కవర్ చేయడంతో ప్రాణాలతో బయట పడింది. దురదృష్టవశాత్తు ఆ పాప తల్లిని ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు.’ అని క్యాప్షన్‌గా పేర్కొంటు ఓ పసిపాప ఫొటోను ట్రెండ్ చేశారు. (లయన్ విమాన ప్రమాదం : కెప్టెన్‌గా ఢిల్లీ వాసి) అయితే ఆ పాప ఈ ఏడాది జూలైలో ఇండోనేషియాలోనే చోటుచేసుకున్న నౌక ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన పాపని, ఆ ఫొటోనే తాజా ప్రమాదానికి ముడిపెడుతూ వైరల్ చేశారని ఆదేశ విపత్తు ఉపశమన సంస్థ అధికార ప్రతినిధి సుటోపా ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. ఇది ఒక గాలివార్తని, ఇలాంటి పుకార్లను నమ్మి, ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సులవేసి నుంచి సెలయార్ తీరానికి వస్తుండగా నౌక మునిగిపోవడంతో సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక నకిలీ వార్తలు ప్రచారం కావడం ఇదే తొలిసారేం కాదు. గతంలో చాలాసార్లు ట్రెండ్ అయ్యాయి. భారత్‌లో కేరళను వరదలు ముంచెత్తినప్పుడైతే ఈ నకిలీ వార్తలకు అడ్డుఅదుపే లేకుండా పోయింది. అలాగే పిల్లలను ఎత్తుకుపోతున్నారనే వాట్సాప్ మెసేజ్‌లతో చాలా మందిపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. (చదవండి: వరదల్లో ఫేక్ న్యూస్ బురద) కేరళ వరదలు: రోనాల్డో 72.. కోహ్లి 82 కోట్లట! -
ఇండోనేసియా విమాన ప్రమాదం.. సహాయక చర్యలు
-
సముద్రంలో కూలిన విమానం
జకార్తా: ఇండోనేసియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని జకార్తా నుంచి సోమవారం ఉదయం 6.20 గంటలకు 189 మందితో పంగ్కల్ పినాంగ్ సిటీకి బయల్దేరిన ‘లయన్ ఎయిర్’ జెట్ విమానం జావా సముద్రంలో కుప్పకూలింది. బయల్దేరిన 13 నిమిషాలకే జకార్తాకు 32 మైళ్ల దూరంలో, కెరవాంగ్ సముద్ర తీరానికి దగ్గర్లో సముద్రంలో కూలిపోయింది. విమానంలో ప్రయాణిస్తున్న 182 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన ‘బోయింగ్ –737 మాక్స్’ జేటీ 610 విమానానికి భారతీయుడైన భవ్య సునేజా పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. ఫ్లైట్ డేటా ప్రకారం.. ఆకాశంలోకి వెళ్లాక వేగం పుంజుకుని 5 వేల అడుగుల పైకి చేరుకున్న కాసేపటికి, రాడార్ సంకేతాలను కోల్పోయి, కంట్రోల్ సెంటర్‌తో సంబంధాలు తెగిపోయి, వేగంగా నేలవైపు దూసుకువచ్చిన విమానం క్షణాల్లో సముద్రంలో కుప్పకూలింది. అంతకుముందు, కొన్ని క్షణాల ముందే, తిరిగి జకార్తాకు తిరిగిరావాల్సిందిగా ఆ విమాన పైలట్‌ను కంట్రోల్ సెంటర్ నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ప్రమాద సమాచారం తెలియగానే అధికారులు సహాయచర్యలు చేపట్టారు. తమకు లభించిన ఆనవాళ్ల మేరకు ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరూ బ్రతికే అవకాశం లేదని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారి బంబాంగ్ సుర్యొ అజి తెలిపారు. విమానం నీళ్ల లోపలికి వేగంగా దూసుకువెళ్లడాన్ని పలువురు ప్రత్యక్ష సాక్షులు కూడా చూశారన్నారు. 40 మంది డైవర్లు సహా 150 మంది సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. సముద్రంలో 30 నుంచి 40 మీటర్ల లోతులో విమాన శకలాలను గుర్తించారు. ఈ ఆగస్ట్‌లోనే ఈ విమానాన్ని సర్వీస్‌లోకి తీసుకున్నామని లయన్ ఎయిర్ సంస్థ తెలిపింది. కొద్ది రోజుల క్రితం స్వల్ప మరమ్మతులకు గురైందని వెల్లడించింది. బాలిలో మరమ్మతులు జరిపి ఇటీవలే మళ్లీ జకార్తా తీసుకువచ్చామని, సోమవారం ఉదయం టేకాఫ్‌కు ముందు కూడా ఇంజనీర్లు స్వల్ప మరమ్మతులు చేశారని, అయితే, అది సాధారణంగా చేసే ప్రక్రియేనని లయన్ ఎయిర్ చీఫ్ ఎడ్వర్డ్ సైరాయిత్ వివరించారు. ఫ్లైట్ డేటా రికార్డర్, వాయిస్ రికార్డర్ లభిస్తే ప్రమాదానికి కచ్చితమైన కారణం తెలుస్తుందన్నారు. ఈ ప్రమాదంపై విమాన తయారీ సంస్థ బోయింగ్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరో గంటలో గమ్యస్థానానికి.. మరో గంటలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన పంగ్కల్ పినాంగ్ సిటీకి ఈ విమానం చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలియగానే జకార్తా విమానాశ్రయం చేరుకున్న ప్రయాణీకులు తమవారి ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న హృదయ విదారక దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. ‘నా కుమార్తె చనిపోయి ఉంటే కనీసం ఆమె ఖననమైనా సరిగ్గా జరగా లని కోరుకుంటున్నాను’ అని ఆ విమాన ప్రయాణఙ కురాలి తల్లి ఒకరు కన్నీళ్లతో చెప్పారు. ఇండోనేసియా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ కమిటీ వివరాల మేరకు.. ప్రమాదానికి గురైన విమానంలో 178 మంది పెద్దలు, ఒక పాప, ఇద్దరు చిన్నారులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు విమాన సహాయక సిబ్బంది ఉన్నారు. వారిలో దాదాపు 20 మంది ఇండోనేసియా ఆర్థిక శాఖ ఉద్యోగులున్నారు. తన స్నేహితులు చాలామంది అందులో ఉన్నారని ఆలస్యం కావడంతో విమానాన్ని అందుకోలేకపోయిన సోనీ సెతియావన్ చెప్పారు. 2015 ఆగస్ట్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా ఇండోనేసియాకే చెందిన త్రిగణ ఎయిర్‌లైన్స్ విమానం కూడా ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 54 మంది ప్రయాణికులు చనిపోయారు. ఏడాదిక్రితం ఎయిర్ ఏసియా విమాన ప్రమాదలో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. తక్కువ ధరలకే విమాన ప్రయాణం కల్పించే సంస్థగా పేరున్న లయన్ ఎయిర్‌కు చెందిన పలు విమానాలకు కూడా గతంలో ప్రమాదాలకు గురైన చరిత్ర ఉంది. 1999లో ప్రారంభం లయన్ ఎయిర్ సంస్థను 1999లో ప్రారంభించారు. ప్రయాణికుల సంఖ్య పరంగా ఇండోనేసియాలో ఇది అతి పెద్ద విమానయాన సంస్థ. అంతర్జాతీయంగానే కాకుండా, దేశీయంగా వేలాది ద్వీపాలకు డజన్ల సంఖ్యలో విమానాలను నడుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా చూసినా, మలేసియాకు చెందిన ఎయిర్ఏషి యా తరువాత చవకైన ఎయిర్‌లైన్ ఇదే. ఈ సంస్థ నడుపుతున్న విమానాల్లో అత్యధికం బోయింగ్ 737 రకానివే. ఈ ఏడాది మొదట్లో 6.24 మిలియన్ డాలర్లతో 50 బోయింగ్ విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. భారత్‌లో సేఫే: డీజీసీఏ భారత్‌లో విధుల్లో ఉన్న బోయింగ్ 737 మాక్స్ విమానాల్లో సాంకేతికపరమైన ఎలాంటి లోపాలు ఇప్పటివరకు తలెత్తలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకటించింది. భారత్‌లో స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్ సంస్థలు భారత్‌లో ఈ రకానికి చెందిన ఆరు విమానాలను నడుపుతున్నాయి. ఎందుకు ఇక్కడే ప్రమాదాలు ఎక్కువ? సుహార్తో నాయకత్వం కింద సైనిక పాలనలో ఉన్న ఇండోనేసియా 1997లో ప్రజాస్వామ్యానికి మళ్లింది. పర్యాటక రంగం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 2000లో విమానయాన రంగంలో ప్రైవేటు సంస్థలకు తలుపులు తెరిచింది. దాంతో అనేక సంస్థలు ఇక్కడ నుంచి సర్వీసులు ప్రారంభించాయి. ప్రస్తుతం దాదాపు 60 విమానయాన సంస్థలు ఇక్కడ పని చేస్తున్నాయి. సంస్థలు ఎక్కువ కావడంతో పోటీ పెరిగి ధరల యుద్ధానికి దారి తీసింది. టికెట్ల రేట్లు పోటీ పడి తగ్గిస్తున్న సంస్థలు నాణ్యత, భద్రత విషయంలో రాజీ పడుతున్నాయి. దీనిపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా కొరవడింది. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయి. 2000 నుంచి తాజా ప్రమాదం వరకు లెక్కిస్తే ఇండోనేసియాలో మొత్తం 45 భారీ ప్రమాదాలు జరిగాయి. 1950–1999 మధ్య 35 ప్రమాదాలు జరిగాయి. ఒక్క 1997లో జరిగిన వివిధ ప్రమాదాల్లో మొత్తం 380 మంది చనిపోయారు. ఇండోనేసియా విమానయాన సంస్థల నిర్వహణలో భద్రతాపరమైన లోపాలున్నాయంటూ యూరోప్ దేశాలకు అక్కడి నుంచి విమాన సర్వీసులు నడపొద్దంటూ యూరోపియన్ యూనియన్ జూన్ 2016లో నిషేధం విధించింది. అమెరికా కూడా దశాబ్దం పాటు విధించిన నిషేధాన్ని 2016లో తొలగించింది. పైలట్ భారతీయుడు ప్రమాదానికి గురైన విమాన ప్రధాన పైలట్ భారతీయుడైన భవ్య సునేజా(31) అని, ఈ ప్రమాదంలో ఆయన కూడా దుర్మరణం చెందారని అక్కడి భారతీయ ఎంబసీ ప్రకటించింది. ఈ విమాన కో పైలట్‌గా హర్వీనో వ్యవహరించారు. సునేజాకు 6 వేల గంటలు, కో పైలట్ హర్వీనోకు 5 వేల గంటలకు పైగా విమానాలను నడిపిన అనుభవం ఉంది. సునేజా ఢిల్లీకి చెందిన వారు. మయూర్ విహార్‌లోని ఆల్కాన్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. 2009లో బెల్ ఎయిర్ ఇంటర్నేషనల్ నుంచి పైలట్ లైసెన్స్ పొందారు. లయన్ ఎయిర్ సంస్థలో 2011 మార్చ్‌లో చేరారు. అంతకుముందు ఎమిరేట్స్‌లో ట్రైనీ పైలట్‌గా చేశారు. లయన్ ఎయిర్ సంస్థను విడిచి భారత్‌కు వచ్చి ఇక్కడి సంస్థలో పని చేయా లని సునేజా భావించా రని భారత్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ వైస్ ప్రసిడెంట్ ఒకరు తెలిపారు. అందుకోసం తమను సంప్రదించాడని, అనుభవజ్ఞుడైన అలాంటి పైలట్ తమకూ అవసరమేనని భావించి, తాము కూడా సుముఖంగానే స్పందించామని చెప్పారు. అయితే, ఆయన ఢిల్లీ పోస్టింగ్ అడగడంతో, సర్వీస్‌లో చేరిన ఏడాది తరువాత ఢిల్లీ పోస్టింగ్ ఇస్తామని చెప్పామని వివరించారు. పైలట్ భవ్య సునేజా -
ఇండోనేషియా విమానాల్లో ‘భద్రత’ లేదు
ఇండోనేషియాలో శనివారం ఉదయం లయన్ ఎయిర్ సంస్థ విమానం ప్రమాదానికి గువరడంతో దాంట్లో ఉన్న 189 మందీ చనిపోయారు.ఇండోనేషియా విమానయాన చరిత్రలో ఇది రెండో అతిపెద్ద ప్రమాదం.ఇంతకు ముందు1997లో జరిగిన ప్రమాదంలో 214 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇతర దేశాలతో పోలిస్తే ఇండోనేషియాలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తోంది. విమానయాన సంస్థల నిర్వహణలోపం, ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడడమే దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. లయన్ ఎయిర్ సంస్థ ఇండోనేషియాలో మలేషియాకు చెందిన ఎయిర్ ఆసియా తర్వాత రెండో అతిపెద్ద విమాన యాన సంస్థ.దీనిలో చార్జీలు చాలా తక్కువ. గత ఏప్రిల్‌లో ఈ సంస్థ విమానం ఒకటి గొరంటాలో విమానాశ్రయంలో రన్‌వే నుంచి జారిపోయింది.సెప్టెంబర్‌లో లయన్ ఎయిర్‌కు చెందిన రెండు విమానాలు జకార్తా విమానాశ్రయంలో ఢీకొనేంత దగ్గరకివచ్చాయి.రెండు విమానాల రెక్కలు ఒకదానికొకటి తగిలాయి.అయితే,ఈ రెండు ప్రమాదాల్లో ప్రాణనష్టం ఏమీ జరగలేదు. ఇండోనేషియా విమానయానానికి సంబంధించి భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే అమెరికా, ఐరోపా యూనియన్లు 2007 నుంచి తమ దేశాల్లోకి ఇండోనేషియా విమానాల రాకపోకల్ని నిషేధించాయి.అయితే, 2016లో అమెరికా, 2018 జూన్‌లో ఐరోపా యూనియన్ ఈ నిషేధాన్ని ఎత్తివేశాయి. నిషేధం తొలగించాకా జరిగిన పెద్ద ప్రమాదం ఇది. సుహార్తో నాయకత్వం కింద సైనిక పాలనలో ఉన్న ఇండోనేషియా 1997లో ప్రజాస్వామ్యానికి మళ్లింది.పర్యాటక రంగం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 2000లో విమానయాన రంగంలో ప్రైవేటు సంస్థలకు తలుపులు తెరిచింది. దాంతో అనేక సంస్థలు ఇక్కడ నుంచి సర్వీసులు ప్రారంభించాయి. ప్రస్తుతం దాదాపు 60 విమానయాన సంస్థలు ఇక్కడ పని చేస్తున్నాయి.సంస్థలు ఎక్కువ కావడంతో పోటీ పెరిగి ధరల యుద్ధానికి దారి తీసింది. టికెట్ల రేట్లు పోటీ పడి తగ్గిస్తున్న సంస్థలు నాణ్యత, భద్రత విషయంలో రాజీ పడుతున్నాయి. దీనిపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా కొరవడింది. ఫలితంగా చాలా సార్లు విమానాల్లో లోపాలు తలెత్తడం, సర్వీసులు రద్దవడం జరుగుతోంది.ప్రమాదాలు కూడా పెరిగాయి. 2000 నుంచి తాజా ప్రమాదం వరకు లెక్కిస్తే ఇండోనేషియాలో మొత్తం 45 భారీ ప్రమాదాలు జరిగాయి.1950–1999 మధ్య 35 ప్రమాదాలు జరిగాయి.ఒక్క 1997లో జరిగిన వివిధ ప్రమాదాల్లో మొత్తం 380 మంది చనిపోయారు. 2016లో విమాన భద్రతకు రేటింగ్ ఇచ్చే వెబ్సైట్ ‘ఎయిర్‌లైన్ రేటింగ్స్ .కామ్’ ప్రపంచ వ్యాప్తంగా 407 ప్రధాన విమాన యాన సంస్థలను పరిశీలించింది.దానిలో భద్రతా ప్రమాణాలు ఏ మాత్రం బాలేని 9 సంస్థలు ఇండోనేషియావేనని తేలింది.ఇండోనేషియా ఎయిర్‌లైన్స్ ప్రపంచంలోనే ప్రమాదకర సంస్థగా ఆ వెబ్సైట్ ప్రకటించింది.ఇండోనేషియా ప్రభుత్వం అంతర్జాతీయ విమాన భద్రత ప్రమాణాలను ఏ మాత్రం పాటించడం లేదని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది. -
లయన్ విమాన ప్రమాదం : కెప్టెన్‌గా ఢిల్లీ వాసి
ఇండోనేషియాలో ఘోర ప్రమాద వార్త విన్న వెంటనే భారతీయులంతా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ప్రమాదంలో భారతీయులెవరూ ఉండకూదంటూ సోషల్ మీడియాలో చాలామంది ప్రార్థించారు. కానీ వారు భయపడినంతా జరిగింది. ముఖ్యంగా న్యూఢిల్లీకి చెందిన భవ్యే సునేజా (31) ప్రమాదానికి గురైన లయన్ విమానానికి కెప్టెన్ పైలట్‌గా ఉన్నారు. ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతానికి చెందిన సునేజా 2009లో పైలట్ లైసెన్స్ పొందారు. ఎమిరేట్స్, కాలిఫోర్నియాలో పైలట్ శిక్షణ పొందారు. 2011లో లయన్ ఎయిర్ సంస్థలో పైలట్‌గా చేరారు. సునేజా భార్య ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో మేనేజరుగా పనిచేశారుట. సునేజా జులైలో ఢిల్లీలో పోస్టింగ్ ఇప్పించాలని కోరారు. చాలా అనుభవమున్న పైలట్. నైపుణ్యాలు ఉన్నాయి కాబట్టే అతన్ని ఇండోనేసియా సంస్థలోనే ఉంచాలనుకున్నామని లయన్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. తమసంస్థలో పనిచేసే పైలట్లంతా ఉత్తర భారత్‌కు చెందినవారే. సునేజా అభ్యర్ధనను వెంటనే అంగీకరించలేకపోయామంటూ లయన్ ఎయిర్ అధికారులు వెల్లడించారు. కాగా ఇండోనేషియా విమానం బెలిటంగ్ దీవులలోప్రధాన నగరమైన పంకకల్ పినాంగ్‌కు బయలుదేరిన లయన్ జెట్పాసింజర్( జేటీ-610 )విమానంలో సముద్రంలో 30-30మీటర్ల లోతులో సోమవారం ఉదయం కూలిపోయింది. ఇద్దరు పైలట్లు, అయిదుగురు సిబ్బంది సహా సుమారు 188 మంది ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదలో ఎవరూ బతికి వుండే అవకాశం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. -
సముద్రంలో కుప్పకూలిన విమానం
-
సముద్రంలో కుప్పకూలిన విమానం
జకార్తా: ఇండోనేషియా రాజధాని నుంచి బయలుదేరిన లయన్ ఎయర్‌లైన్స్‌కు చెందిన విమానం కనిపించకుండా పోయింది. జకార్తానుంచి సుమంత్రాకు టేక్ ఆఫ్ తీసుకున్న కొద్దిసేపటికే అదృశ్యమైందని ఇండోనేషియా అధికారులు చెప్పారు. బోయింగ్ 737 గా భావిస్తున్న ఈ విమానంలో ఎంతమంది ప్రయాణీకులు ఉన్నది స్పష్టం కాలేదు. ఏం జరిగిందీ ఇంకా తెలియలేదనీ గాలింపు, సహాయ కార్యక్రమాల ఆపరేషన్ ప్రారంభించినట్టు ఎయిర్‌లైన్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి బాంకా బెలిటంగ్ దీవులలో ప్రధాన నగరమైన పంకకల్ పినాంగ్‌కు బయలుదేరిన లయన్ జెట్ పాసింజర్( జేటీ-610)విమానం సముద్రంలో కూలిపోయినట్టుగా భావిస్తున్నారు. సుమారు 200పైగా ప్రయాణికులు ఉండొచ్చని అంచనా. సముద్రాన్ని దాటుతూ కూలిపోయిందని, విమానం శకలాలు కనిపించాయన్న స్తానికుల కథనాల ఆధారంగా అక్కడ గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అటు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి యూసఫ్ లతీఫ్ విమానం క్రాష్ అయిందని ధృవీకరించారు. సుమారు 30-40 మీటర్ల లోతులోకి ఈ విమానం కుప్పకూలిందని పేర్కొన్నారు. బాధితులకు చెందిన డ్రైవింగ్ లెసెన్స్, ఐడీ కార్డులతోపాటు కొన్ని వస్తువులు నీటిలో కొట్టుకు వచ్చాయని ఆయన తెలిపారు. మొత్తం 188 మంది ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఒక పసిపాప, ఇద్దరు చిన్నపిల్లలు, 178 ప్రయాణికులతోపాటు ఇద్దరు పైలెట్లు, అయిదుగురు సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 2013లో లయన్‌కు చెందిన విమానం బాలి సముద్రంలో కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో సిబ్బంది, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 2014లో ఇదే సంస్థకు చెందిన విమాన ప్రమాదంలో 25మంది ప్రాణాలు కోల్పోయారు. #JT610 The plane appears to have gone down somewhere in the red circle. We know from previous incidents out there that it is very hard to be certain of locations. pic.twitter.com/AepgJaRB9r — Mike Chillit (@MikeChillit) October 29, 2018 We're following reports that contact has been lost with Lion Air flight #JT610 shortly after takeoff from Jakarta. ADS-B data from the flight is available at https://t.co/zNM33cM0na pic.twitter.com/NIU7iuCcFu — Flightradar24 (@flightradar24) October 29, 2018 -
విమానం గాల్లో ఉండగానే పైలెట్ మృతి
బ్యాంకాక్: విమానం గాలిలో ప్రయాణిస్తుండగానే కో పైలెట్ కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన మలేషియా బడ్జెట్ ఎయిర్ లైన్స్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగినపుడు ఈ విమానంలో 152 మంది ప్యాసింజర్లు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. థాయ్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కో పైలెట్ కుప్పకూలారని తెలుసుకుని.. లయన్ ఎయిర్ ఫ్లైట్ ఎస్ఎల్ 8537 ను వెనక్కి రప్పించి హత్ యాయ్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాడింగ్ చేశారు. ల్యాండిగ్ కాగానే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో 152 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.