ఇంగ్లండ్‌లో భారతీయ మహిళ హత్య | Missing Indian-origin woman found murdered in UK | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌లో భారతీయ మహిళ హత్య

Published Wed, Nov 2 2016 11:43 AM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

ఇంగ్లండ్‌లో భారతీయ మహిళ హత్య

ఇంగ్లండ్‌లో భారతీయ మహిళ హత్య

లండన్: ఇంగ్లండ్లో 15 రోజుల క్రితం అదృశ్యమైన భారత సంతతి మహిళ పర్దీప్ కౌర్ హత్యకు గురైంది. లండన్లోని హీత్రో విమానాశ్రయం సమీపంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.

వివాహిత అయిన పర్దీప్ కౌర్ ఓ హోటల్లో హౌస్ కీపర్గా పనిచేస్తోంది. అక్టోబర్ 16న ఆమె ఉద్యోగానికి వెళ్లిన తర్వాత మళ్లీ ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆమె విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆగంతకుడు ఆమెపై దాడి చేశాడని, గొంతు పిసికి చంపి హత్యచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. విమానాశ్రయం సమీపంలో లభ్యమైన మృతదేహాన్ని పర్దీప్ కౌర్దిగా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement