Indian-Origin Woman
-
అనూష షా...విల్ పవర్ ఉన్న సివిల్ ఇంజనీర్
‘నా వృత్తిలో నేను రాణిస్తే చాలు. అదే పదివేలు’ అని సంతృప్తి పడి, సర్దుకుపోయేవాళ్లే ఎక్కువమంది కనిపిస్తారు. ‘నా వృత్తి వల్ల పర్యావరణానికి ఏ మేరకు హాని జరుగుతోంది?’ అని ఆలోచించేవాళ్లు అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన వ్యక్తి... అనూష షా. పచ్చటి ప్రకృతి ప్రపంచంలో పుట్టి పెరిగిన అనూషకు పర్యావరణ విలువ తెలుసు. సివిల్ ఇంజనీర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న అనూష వృత్తి విజయాలను చూసి ΄÷ంగిపోవడం కంటే వృత్తికి సామాజిక బాధ్యతను జోడించడానికే అధికప్రాధాన్యత ఇచ్చింది. తన వంతుగా వివిధ వేదికలపై పర్యావరణ హిత ప్రచారాన్ని విస్తృతం చేసింది. తాజాగా... బ్రిటన్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ఐసీయి)కి అధ్యక్షురాలిగా ఎంపికైంది అనూష షా. రెండు శతాబ్దాల చరిత్ర ఉన్న ప్రతిష్ఠాత్మకమైన ‘ఐసీయి’ అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన తొలి భారతీయురాలిగా అనూష షా చరిత్ర సృష్టించింది... ‘వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్’లో అనూష షాకు రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. డిజైనింగ్, మేనేజింగ్లో, ప్రాజెక్ట్స్–ప్రొగ్రామ్‌లను లీడ్ చేయడంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ‘నిర్మాణం వల్ల నిర్మాణం మాత్రమే జరగడం లేదు. ప్రకృతికి ఎంతో కొంత నష్టం జరుగుతుంది’ అనేది ఒక సామాజిక సత్యం. దీన్ని దృష్టిలో పెట్టుకొని వృత్తికి సామాజిక బాధ్యత కూడా జోడించి ముందుకు వెళుతోంది అనూష. ‘నా వృతి వల్ల నాకు ఆర్థికంగా మేలు జరగడం మాట ఎలా ఉన్నా, చేటు మాత్రం జరగవద్దు’ అంటోంది అనూష. అందుకే తన వృత్తిలో పర్యావరణ హిత విధానాలను అనుసరిస్తోంది. ‘సివిల్ ఇంజనీరింగ్‌ను పీపుల్–పాజిటివ్ ప్రొఫెషన్‌గా చూడాలనేది నా కల. మౌలిక వసతులు, ప్రకృతికి మధ్య ఉండే అంతఃసంబంధాన్ని అర్థం చేసుకోవడంలో మొదట్లో మేము విఫలమయ్యాం. ఆ తరువాత మాత్రం ప్రకృతికి హాని జరగని విధానాలను అనుసరించాం’ అంటుంది అనూష. అందమైన కశ్మీర్లో పుట్టి పెరిగిన అనూషకు ప్రకృతి విలువ తెలుసు. కశ్మీర్‌లోని దాల్ సరస్సు సంరక్షణ కోసం దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ కోసం ఇరవై మూడు సంవత్సరాల వయసులో కన్సల్టింగ్ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా పనిచేసింది. ఆ తరువాత కామన్వెల్త్ స్కాలర్‌షిప్‌తో బ్రిటన్ వెళ్లి ‘వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్’లో ఎంఎస్సీ చేసింది. ‘΄్లాన్ ఫర్ ఎర్త్’ అనే క్లైమెట్ ఛేంజ్ కన్సెల్టెన్సీని మొదలు పెట్టి పర్యావరణ సంరక్షణకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. వివిధ పరిశ్రమలకు సంబంధించిన ‘నెట్‌జీరో అండ్ క్లైమెట్ ఛేంజ్’ బృందాలతో సమావేశమై విలువైన సూచనలు ఇచ్చింది. చర్చాకార్యక్రమాల్లో పాల్గొన్నా, వ్యాసాలు రాసినా, టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినా, సమావేశాల్లో ఉపన్యాసం ఇచ్చినా...ప్రతి అవకాశాన్ని పర్యావరణ హిత ప్రచారానికి ఉపయోగించుకుంది. ‘మన గురించి మాత్రమే కాదు భవిష్యత్ తరాల గురించి కూడా ఆలోచించాలి. ఉన్నతమైన విలువలతో ప్రయాణించినప్పుడే మన గమ్యస్థానం చేరుకోగలం’ అంటుంది అనూష. ‘క్లైమెట్ చేంజ్ ఇన్ ఇంజనీరింగ్’ అంశానికి సంబంధించి అనూష చేపట్టిన అవగాహన కార్యక్రమాలకు గానూ ‘యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్’ నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించింది. కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటన్ నుంచి ముంబైకి వచ్చింది అనూష. ఆ సమయంలో తన స్వస్థలం కశ్మీర్‌ను వరదలు ముంచెత్తాయి. ఎంతోమంది చనిపోయారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఇది అనూషను బాగా కదిలించింది. ‘విషాదం నుంచి కూడా నేర్చుకోదగినవి చాలా ఉంటాయి. ఇది అలాంటి విషాదమే’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అనూష. ‘ముందుచూపు, ముందు జాగ్రత్త ఉన్న వాళ్ల వైపే అదృష్టం మొగ్గు చూపుతుంది’ అనేది అనూష షాకు బాగా ఇష్టమైన మాట. ‘మన వల్ల ఏమవుతుంది అనే భావన కంటే ఔట్ ఆఫ్ బాక్స్‌లో ఆలోచించి, ధైర్యంగా ముందుకు వెళ్లడం వల్లే ఎక్కువ మేలు జరుగుతుంది. సంకల్పబలం ఉన్న చోట అద్భుతమైన ఫలితాలు వస్తాయి’ అనేది ఆమె బలంగా చెప్పే మాట. -
రిషి కేబినెట్లోకి మరో భారత సంతతి మహిళ
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ కొత్తగాకేబినెట్లోకి క్లెయిర్ కౌటిన్హో(32) అనే భారత సంతతి మహిళా సభ్యురాలిని చేర్చు కున్నారు. ఇంధన భద్రత మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మెన్తోపాటు క్లెయిర్ పూర్వీకులు కూడా గోవాకు చెందిన వారే. రక్షణ మంత్రి బెన్ వాలెస్ రాజీనామాతో ఆ బాధ్యతలను ఇంధన మంత్రి గ్రాంట్ షాప్స్కి అప్పగించారు. షాప్స్ నిర్వహించిన శాఖను క్లెయిర్‌కు ఇచ్చారు. ఈస్ట్ సర్రే నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. -
ఆమె చావుకు కారణం బాయ్‌ఫ్రెండే
లండన్: గత ఫిబ్రవరిలో సంచలనం కలిగించిన భారతీయ సంతతి మహిళ మీరా దాలాల్ ఆత్మహత్యకు కారణం వేధింపులే కారణమని కోర్టు తెలిపింది. లండన్‌లో గత ఫిబ్రవరీలో మీరా దలాల్ తన బాయ్‌ప్రెండ్ వేధింపులు భరించలకే ఆత్మహత్య చేసుకుందని కోర్టు అభిప్రాయ పడింది. ఇంగ్లాడ్, లీసెస్టర్షైర్లోని మీరా దలాల్ 2013నుంచి ప్రేమలో ఉంది. బాయ్‌ప్రెండ్ వేధింపులు తట్టుకోలేక గత ఫిబ్రవరీలో తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుంది. దీనిపై మీరా తల్లిదండ్లు స్వతంత్ర పోలీసుల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన లైఫ్బోరో కోర్టు, డాక్టర్ల నివేదిక ఆధారంగా గతవారం విచారణ చేపట్టింది. ప్రత్యక్ష సాక్ష్యాలు లేకపోవడంతో డాక్టర్ల నివేదికల ఆధారంగా తీర్పు వెలువరించింది. మీరా తల్లిదండ్రులు విచారణకు కృషి చేసిన పోలీసులకు, వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం వారు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గృహ హింస బాధితులు, వెలివేయబడిన వారికోసం ప్రత్యేకంగా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి నిధులు సేకరిస్తున్నారు. -
నేరం ఒప్పుకున్న ఎన్నారై మహిళ
హెచ్1బీ వీసా మోసం కేసు న్యూయార్క్: హెచ్1బీ వీసా మోసం కేసులో భారత సంతతి మహిళ హిరల్ పటేల్ తన నేరాన్ని అంగీకరించింది. ఈ కేసులో ఆమెకు జూన్ నుంచి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. కోటి 67 లక్షల జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. జెర్సీ సిటీకి చెందిన హిరల్ పటేల్(34) అమెరికాలోని రెండు ఐటీ కంపెనీలకు(ఎస్సీఎమ్ డేటా అండ్ ఎమ్ఎన్సీ సిస్టమ్స్) హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈ కంపెనీలు విదేశీయులను, విద్యార్థి వీసా కలిగినవారిని, పట్టభద్రలైనవారిని హెచ్1బీ వీసా ప్రోగ్రామ్ కింద రిక్రూట్ చేసుకునే క్రమంలో నిబంధనలను ఉల్లంఘించాయి. పూర్తిస్థాయి ఉద్యోగం కల్పించకుండా, సమాఖ్య నియమాల ప్రకారం జీతాలు చెల్లించకుండా మోసాలకు పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి కెవిన్ మెక్‌నల్టీ ముందు హిరల్ పటేల్ తన నేరాన్ని అంగీకరించారు. -
ఇంగ్లండ్‌లో భారతీయ మహిళ హత్య
లండన్: ఇంగ్లండ్‌లో 15 రోజుల క్రితం అదృశ్యమైన భారత సంతతి మహిళ పర్దీప్ కౌర్ హత్యకు గురైంది. లండన్‌లోని హీత్రో విమానాశ్రయం సమీపంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. వివాహిత అయిన పర్దీప్ కౌర్ ఓ హోటల్లో హౌస్ కీపర్‌గా పనిచేస్తోంది. అక్టోబర్ 16న ఆమె ఉద్యోగానికి వెళ్లిన తర్వాత మళ్లీ ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆమె విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆగంతకుడు ఆమెపై దాడి చేశాడని, గొంతు పిసికి చంపి హత్యచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. విమానాశ్రయం సమీపంలో లభ్యమైన మృతదేహాన్ని పర్దీప్ కౌర్దిగా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. -
దొంగలను తరిమికొట్టిన ఎన్నారై మహిళ
-
దొంగలను తరిమికొట్టిన ఎన్నారై మహిళ
లండన్: ఇంగ్లండ్ లో భారత సంతతికి చెందిన ఓ మహిళ చూపిన తెగువ ప్రశంసలంటుకుటోంది. చోరులను సమర్థవంతంగా తిప్పికొట్టడంతో ఆమె చూపిన ధైర్యం అందరి మన్ననలు పొందుతోంది. హేమలతా పటేల్(56) అనే మహిళ అసమాన తెగువతో దొంగలను నిలువరించారు. చేషైర్ ప్రావిన్స్ లోని విన్స్ ఫోర్డ్ పట్టణంలో న్యూస్ ఏజెంట్ స్టోర్ లో ఉండగా ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు లోపలికి చొరబడి దొంగతనానికి యత్నించారు. హేమలతతో పాటు దుకాణంలో ఉన్న ఇద్దరు మహిళలను కత్తితో బెదిరించారు. హేమలత ఏమాత్రం భయపకుండా దొంగలను ఎదిరించారు. పక్కనేవున్న స్టీలు కుర్చీని చేతుల్లోకి తీసుకుని దొంగలను దుకాణం నుంచి తరిమికొట్టారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఇది జరిగినప్పుడు హేమలత భర్త దీరుభాయ్, మనవరాళ్లు దుకాణం వెనుకవైపు ఉన్నారు. కేకలు విని వాళ్లందరూ వచ్చేటప్పటకి దొంగలు పారిపోయారు. తనకేం కాలేదని తెలియడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారని హేమలత తెలిపారు. 30 ఏళ్లుగా తాము ఇక్కడ దుకాణం నిర్వహిస్తున్నామని, 2011లోనూ చోరియత్నం జరిగిందని వెల్లడించారు. దుకాణం వెలుపల ఉన్న క్యాష్ మిషన్ ను పగలగొట్టేందుకు విఫలయత్నం చేశారని, అయితే ఆ సమయంలో తాము షాపులో లేమని చెప్పారు. కాగా, తాజాగా చోరీకి యత్నించిన ఇద్దరు 16, 14 ఏళ్ల బాలురని పోలీసులు గుర్తించారు. వీరిని అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేశారు. -
'తప్పు చేశాను... క్షమించండి'
మియామి(ఫ్లోరిడా): అమెరికాలోని మియామిలో మద్యం మత్తులో హంగామా సృష్టించిన భారత సంతతికి మహిళా డాక్టర్ రామకి సూన్(30) క్షమాపణ కోరింది. ఉబర్ క్యాబ్ డ్రైవర్ పై ఆమె దాడి చేసిన వీడియో ఆన్ లైన్ లో హల్ చల్ చేయడంతో వివరణయిచ్చింది. జాక్సన్ హెల్త్ సిస్టమ్ లో న్యూరాలజీ రెసిడెంట్ గా పనిచేస్తున్న రామకి సూన్(30) వారం క్రితం మద్యం మత్తులో క్యాబ్ డ్రైవర్ పై దాడి చేసింది. అతడు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో మరింత రెచ్చిపోయింది. విచక్షణారహితంగా బాదేసింది. తర్వాత కారులోకి ఎక్కి పేపర్లు, ఇతర వస్తువులు బయటకు విసిరేసింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఆమె తప్పు ఒప్పుకుంది. తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నానని ఏబీసీ న్యూస్ తో చెప్పింది. ఈ ఘటనతో తాను చాలా మందిని బాధ పెట్టానని పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. కుంగుబాటు కారణంగానే అలా ప్రవర్తించానని, తన జీవితంలోనే అది దుర్దినమని పేర్కొంది. దాడి జరిగిన రోజున తన తండ్రి ఆస్పత్రి పాలయ్యారని, తన ప్రియుడి నుంచి విడిపోయానని వెల్లడించింది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం శ్రేయస్కరం కాదని భావించి తన కారును అక్కడే వదిలేశానని తెలిపింది. అదే సమయంలో ఉబర్ క్యాబ్ రావడంతో ఈ ఉదంతం చోటు చేసుకుందని వివరించింది. అయితే ఉబర్ క్యాబ్ ను పిలిచిన మరో ప్రయాణికుడు అక్కడ జరిగిందంతా సెల్ ఫోన్ తో వీడియో తీసి యూట్యాబ్ లో పెట్టాడు. ఈ వీడియోతో తన కుటుంబ పరువు రచ్చకెక్కిందని రామకి సూన్ వాపోయింది. జరిగిన దానికి తనదే బాధ్యత అని, తనను మన్నించాలని వేడుకుంది. ఆమెను వైద్య విధుల నుంచి జాక్సన్ హెల్త్ సిస్టమ్ తొలగించి సెలవుపై పంచించింది. అవసరమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. -
స్విమ్మింగ్ పూల్ లో పడి ఎన్నారై మహిళ మృతి
న్యూయార్క్: ప్రవాస భారతీయ మహిళ ఒకరు అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతురాలు రాజకుమారి మోత్వానీ(55)గా గుర్తించారు. ఈతకొలను(స్విమ్మింగ్ పూల్)లో పడి ఆమె మృతి చెందింది. ఆమె మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లాంగ్ ఐలాండ్ లోని ఓ ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌ను ఆదివారం ఉదయం శుభ్రం చేస్తుండగా రాజకుమారి మృతదేహం బయటపడింది. అంతకుముందు రాత్రి ఆ ఇంట్లో పుట్టినరోజు పార్టీ జరిగినట్టు సల్ఫోక్క్ పోలీసులు తెలిపారు. బర్త్ డే పార్టీకి ఆమె గెస్ట్‌గా వచ్చినట్టు గుర్తించారు. రాజకుమారి మృతదేహాన్ని సల్ఫోక్క్ కౌంటీ మెడికల్ అధికారి కార్యాలయానికి తరలించారు. అయితే రాజకుమారి మృతి వెనుక కుట్ర కోణం ఏదీ కనబడలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆమె మృతికి సంబంధిన వివరాలు తెలిస్తే చెప్పాలని స్థానికులను పోలీసులు కోరారు. -
అమెరికాలో ఎన్నారై మహిళ అనుమానాస్పద మృతి
అమెరికాలో కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన భారత సంతతి మహిళ ఒకరు అనుమానాస్పద స్థితిలో ఓ కారులో మరణించి కనిపించారు. ఆమె ఇద్దరు బిడ్డల తల్లి. అమెరికాలోని పెన్సల్వేనియా రాష్ట్రంలో ఉండేవారు. నాదియా మాలిక్ (22) ప్రీ మెడికల్ విద్యార్థిని. ఫిలడెల్ఫియాలో అత్యంత రద్దీగా ఉండే ఓ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కారులో ప్రయాణికుల సీట్లో మరణించి కనిపించారు. మాలిక్ స్నేహితుడు భూపీందర్ సింగ్‌ను పోలీసులు గతంలో పెరోల్ ఉల్లంఘన కేసులో అరెస్టు చేశారు. అతడిని ఓహియో నుంచి ఫిలడెల్ఫియా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అతడికి గతంలో నేరచరిత్ర ఉండటంతో అతడిని ప్రశ్నించాలని యోచిస్తున్నారు. వీరిద్దరి మధ్య సంబంధం ఉందని అధికారులు అంటున్నారు. ఆ కారు ఆ ప్రాంతంలో 12 రోజులుగా పడి ఉన్నా.. నాదియా మాలిక్ మృతదేహాన్ని మాత్రం ఎవరూ గుర్తించలేదు. చివరకు కారును అక్రమంగా పార్కింగ్ చేసినందుకు పోలీసులు తనిఖీ చేయగా విషయం తెలిసింది. మంచు దట్టంగా అలముకోవడంతో దాన్ని తొలగించే యంత్రాలకు అడ్డుగా ఉందని కారును వేరే ప్రదేశానికి తరలించారు కూడా. అప్పుడూ ఆమె మృతదేహాన్ని గుర్తించలేదు. ఆమె శవం ఓ బ్యాగ్, దుస్తుల కింద దాచిపెట్టి ఉండటంతో ఎవరికీ తెలియలేదు. ఈనెల పదోతేదీ నుంచి ఆమె అదృశ్యమైనట్లు ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. నాదియా పిల్లలిద్దరికీ తండ్రి అయిన భూపీందర్ సింగ్‌తో చివరిసారిగా ఆమె కనిపించినట్లు తెలిసింది. తాను భూపీందర్తో ఉన్నానని, అతడు తనను బయటకు వెళ్లనివ్వట్లేదని తనకు చెప్పినట్లు నాదియా స్నేహితుడు థామస్ సింగ్ పోలీసులకు తెలిపాడు. -
ఉగ్రవాద ఆరోపణలతో భారత సంతతి మహిళ అరెస్టు
భారత సంతతికి చెందిన ఓ మహిళను లండన్‌లో ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టు చేశారు. ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ అనంతరం కుంతల్ పటేల్ (36)ను ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు, ఉగ్రవాద నిరోధ అధికారులు కలిసి శని, ఆది వారాలలో లండన్‌లోని మూడు ప్రాంతాల్లో సోదాలు జరిపారు. అనంతరం తగిన ఆధారాలు లభించడంతో కుంతల్ పటేల్‌ను అరెస్టు చేశామన్నారు. ఆమెను వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు తెలిపారు. దక్షిణ లండన్‌లోని స్ట్రీట్హామ్ హిల్ ప్రాంతంలో గల వయట్ పార్క్ రోడ్డులోని రెండు ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. దాంతోపాటు స్ట్రాఫర్డ్లో కూడా సోదాలు చేసి, అక్కడే కుంతల్‌ను అరెస్టు చేశారు. ఓ బ్రిటిష్ దౌత్యవేత్త కుమారుడిని (19) కూడా పోలీసులు ఇదే సందర్భంలో అరెస్టు చేశారు. అయితే అతడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదీ చెప్పలేదు. తర్వాత బుధవారం రాత్రి కుంతల్ పటేల్‌పై ఆరోపణలు చేశారు. వీరిద్దరినీ ఉగ్రవాద నిరోధ, నేర నిరోధ, భద్రతా చట్టం -2011 కిందే అరెస్టు చేశారు. కుంతల్ పటేల్ బ్యాంకర్ కాగా, ఆమె తల్లి మీనా పటేల్ ఓ మేజిస్ట్రేట్. వీరి కుటుంబం చాలా గౌరవప్రదమైనదని, కుంతల్, ఆమె చెల్లెలు ప్రాథమిక పాఠశాలలో చదువుకునేప్పటి నుంచి తనకు తెలుసని వారి కుటుంబ సన్నిహితుడు ఒకరు తెలిపారు. అయితే వీరిపై ఉగ్రవాద ఆరోపణలు చేయడానికి కారణాలేంటో, పోలీసులకు లభించిన ఆధారాలేంటో మాత్రం ఇంకా తెలియరావడంలేదు.